
ముంబై మహానగరం తనకు ఆక్రమిత కశ్మీర్‌లా కనిపిస్తోందని కంగన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వంలో ప్రకంపణలు సృష్టించింది. ఆమెపై పలువురు బాలీవుడ్ తారలు విమర్శలు గుప్పించారు. శివసేన నేతలు మరో అడుగు ముందుకేసి కంగన ముంబైలో అడుగుపెడితే రాళ్లతో కొట్టి చంపుతామని హెచ్చరించడం పెను వివాదంగా మారింది.
ఎవరేం చేసినా తాను ముంబైలో అడుగుపెడతానని, ఏం చేస్తారో చేయండని కంగన సవాల్ విసిరింది. దీంతో ముంబై వాతావరణం వేడెక్కింది. కంగనకు తాజాగా మరిన్ని బెదిరింపులు మొదలయ్యాయి. చంపేస్తామని బాహాటంగా రాజకీయ నాయకులు బెదిరింపులకు దిగడంతో ఆమెకు వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించబోతున్నారు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌తో పాటు 11 మంది భద్రతా సిబ్బంది వుంటారట.
కంగన ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో వుంటోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాన్ని కంగన తండ్రి, సోదరి కంగనకు భత్రకల్పించాలని కోరడంతో ఆమెకు ముంబైలోనూ భద్రత కల్పించే ఏర్పాట్లు చేస్తోంది హిమాచల్ ప్రభుత్వం. ప్రస్తుతం ఈ అంశం ముంబైలో హాట్ టాపిక్‌గా మారింది.