Homeన్యూస్లఘు చిత్రాల పోటీ

లఘు చిత్రాల పోటీ

AvatharanaFilmotsavamతెలంగాణ ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ కళాభవన్, రవీంద్ర భారతి, సైఫాబాద్, హైదరాబాద్ అవతరణ ఫిల్మోత్సవం (లఘుచిత్రాల పోటీకి ఆహ్వానం) విషయం: తెలంగాణా రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో
ఇటీవలి కాలంలో లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు రూపొందించే యువ దర్శకులు ఎంతో మంది తమదైన సృజనాత్మకతతో ముందుకు వస్తున్నారు. తమ టాలెంట్ కి పదును పెట్టుకుంటూ కొత్తకథలతో, కథనాలతో,టెక్నిక్,టెక్నాలజీతో తమ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. వీరు తీసిన షార్ట్ ఫిల్మ్ లు కానీ, డాక్యుమెంటరీలు కానీ అద్భుతమైన ప్రశంసలు పొందుతున్నాయి.ఈ పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ
రవీంద్ర భారతి ప్రివ్యూ థియేటర్ వేదికగా జూన్ 2 , 2015  నుండి “తెలంగాణా ఉద్యమంలో షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీల పాత్ర” సెమినార్ తో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు సినివారం, సండే సినిమా , ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిలిం ఫెస్టివల్, బతుకమ్మ ఫిల్మోత్సవం, అవతరణ ఫిల్మోత్సవం, కళారాధన చిత్రోత్సవం యువచిత్రోత్సవం (లఘుచిత్రాల పోటీ – 2017 ) పేరుతో ఫిలిం మేకర్స్ కి హబ్ గా నిలుస్తున్న విషయం మీకు విదితమే. అలాగే పునర్నిర్మించబడ్డ ప్రివ్యూ థియేటర్ కి పైడి జైరాజ్ పేరు పెట్టుకోవడం మనకు ఆనందాన్ని కలిగించే విషయమే.
ఈ నేపథ్యంలోనే 2018 తెలంగాణా రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో  భాగంగా భాషా సాంస్కృతిక శాఖ, “అవతరణ ఫిల్మోత్సవం” నిర్వహించాలని నిర్ణయించింది. 2017 లో మొదటిసారి విజయవంతంగా అవతరణ ఫిల్మోత్సవం నిర్వహించాం. ఆ స్పూర్తిని కొనసాగిస్తూ ఈ సంవత్సరం షార్ట్ ఫిలిం మేకర్స్ కి కాంపిటేటివ్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. ఇందులో ఉత్తమ చిత్రాలుగా ఎంపికైనవాటికి, వివిధ క్యాటగిరిలలో ఉత్తమంగా నిలిచిన వారికి నగదు బహుమతులు అందించనున్నాము.
అవతరణ ఫిల్మోత్సవం విధి విధానాలు :
20 నిమిషాలకు మించని షార్ట్ ఫిలిమ్స్ అర్హమైనవి.
ఫిక్షన్ జానర్ లో ఉన్న షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే అనుమతించబడతాయి.
ప్రపంచంలో ఎక్కడ షూట్ చేసిన షార్ట్ ఫిలిం అయినా  అర్హమైనదే.
తెలంగాణా/తెలుగుభాషలో లేని  షార్ట్ ఫిలిమ్స్ కి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తప్పనిసరి.
జూన్ 2 , 2017 తర్వాత పూర్తి చేయబడ్డ చిత్రాలు మాత్రమే అర్హమైనవి.
యుట్యూబ్ , విమియో , ఏ ఇతర ఆన్ లైన్ ప్లాట్ ఫారంలో పెట్టని ఫిలిమ్స్ మాత్రమే అర్హమైనవి.
ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు
మీ ఫిలింలో తప్పకుండ తెలంగాణ భాష లేదా తెలంగాణ ప్రాంతం లేదా తెలంగాణా సంస్కృతిని చూపించాలి. పైన చెప్పిన ఎదో ఒక థీమ్ లేని చిత్రాలు సెలక్షన్ కి అనర్హం.
మీ చిత్రం లో వ్యక్తులను, వర్ణాన్ని, కులాన్ని, వర్గాన్ని,మతాన్ని, ప్రాంతాన్ని, దేశాన్ని, భాషని, సంస్కృతిని కించపరచకూడదు.
ఐదుగురు జ్యూరీ మెంబర్స్ నిర్ణయం అంతిమం.
బహుమతుల క్యాటగిరిస్:
 ఉత్తమ మొదటి షార్ట్ ఫిలిం – 50,000 ప్రైజ్ మనీ
ఉత్తమ రెండో షార్ట్ ఫిలిం – 40,000  ప్రైజ్ మనీ
ఉత్తమ మూడో షార్ట్ ఫిలిం – 30,000 ప్రైజ్ మనీ
టాప్ 5  చిత్రాలకు 10,000 చొప్పున ప్రైజ్ మనీ
ఉత్తమ దర్శకుడు – 20,000 ప్రైజ్ మనీ
ఉత్తమ ఛాయాగ్రాహకుడు – 20,000 ప్రైజ్ మనీ
ఉత్తమ సంగీత దర్శకుడు – 20,000 ప్రైజ్ మనీ
ఉత్తమ ఎడిటర్ – 20,000 ప్రైజ్ మనీ
అప్లై చేయడానికి చివరి తేది మే 25, 2018
సెలక్షన్ లిస్టు మే 31 న ప్రకటించబడుతుంది.
అవతరణ ఫిల్మోత్సవం జూన్ 2 నుండి జూన్ 5 వరకు జరుగుతుంది.
సెలెక్ట్ కాబడ్డ అన్ని చిత్రాలు పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ప్రదర్శింప బడతాయి.
సెలెక్ట్ కాబడిన అన్ని చిత్రాలకు భాష సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుండి పార్టిసిపేషణ్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.
ఉత్తమ ఐదు చిత్రాలకు మెమెంటో , క్యాష్ ప్రైజులు, సర్టిఫికెట్స్ ప్రధానం చేయబడతాయి. ప్రభుత్వం నుండి సన్మానం ఉంటుంది.
జూన్ 5 సాయంత్రం 6 గంటల నుండి గ్రాండ్ గా ఫిల్మోత్సవం బహుమతుల ప్రధానం రవీంద్రభారతి మెయిన్ హాల్ లో జరుగుతుంది.
updates కోసం www.facebook.com/paidi.rb పేజి ని లైక్ చేయండి.
వివరాలన్నీ ఆన్లైన్ లో #TAFi2018 hashtag తో పోస్ట్ చేయబడతాయి.
ఎంట్రీ ఫారం , హామీ పత్రం, పోస్టర్స్ , వర్కింగ్ స్టిల్స్, ట్రైలర్, 1080p ఫిలిం  తో మీరు ఆన్లైన్ లో అప్లై చేయాలి.  ఏదైనా ప్రశ్నలకు +91 6302 19 2018 వాట్సాప్ లేదా కాల్ చేయోచ్చు. మిగతా వివరాలన్నీ ఈ లింక్ లో ఉంటాయి.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All