Homeగాసిప్స్మెగా 152 టైటిల్ పై ఆసక్తికర అప్డేట్

మెగా 152 టైటిల్ పై ఆసక్తికర అప్డేట్

మెగా 152 టైటిల్ పై ఆసక్తికర అప్డేట్
మెగా 152 టైటిల్ పై ఆసక్తికర అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి తన కలల ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి కోసం చాలా సమయం తీసుకున్నాడు. దాదాపు రెండేళ్ల పాటు రిలీజ్ అన్నది లేదు. సైరా షూటింగ్ లేట్ అవ్వడం వల్ల దాని తర్వాత కొరటాల శివతో చేయాల్సిన సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది. మాములుగా అనుకున్న దాని ప్రకారమైతే కొరటాల శివ – చిరంజీవి సినిమా షూటింగ్ ఈపాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ సైరా ఆలస్యం వల్ల ఇంకా షూటింగ్ మొదలుకావాల్సిన పరిస్థితి. దసరాకి కొరటాల శివ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు కానీ ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. డిసెంబర్ నుండి మొదలయ్యే అవకాశముంది. ప్రస్తుతం చిరంజీవి తన లుక్ విషయంలో, ఫిట్నెస్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇంకా ఇందులో చిరంజీవి దేవాదాయ శాఖలో క్లర్క్ గా కనిపిస్తాడని ఒక న్యూస్ ఉంది. ఆ శాఖలో జరిగే అవినీతి, అక్రమాలపై గొంతెత్తి ప్రశ్నించబోతున్నట్లు సమాచారం. కొరటాల శివ గత సినిమాల్లోలానే ఈ చిత్రంలో కూడా సామజిక బాధ్యత కలిగి ఉంటాడని అంటున్నారు. మరోవైపు చిరంజీవి ఇందులో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, ఒక హీరోయిన్ గా త్రిష ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల విషయంలో అధికారిక సమాచారం లేదు. ఈ వార్తల్లో ఎంత వరకూ నిజముందన్న విషయంపై క్లారిటీ లేదు.

ఇవన్నీ పక్కనపెడితే లేటెస్ట్ గా ఈ సినిమాపై టైటిల్ పై తాజాగా రూమర్స్ మొదలయ్యాయి. ఈ సినిమాకు గోవింద ఆచార్య అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి కానీ ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఇందులో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇది జరిగిన కొన్ని రోజులకు గోవిందా హరి గోవిందా అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇది జరిగి ఎన్ని రోజులవుతున్నా ప్రొడక్షన్ హౌస్ ఈ టైటిల్ ను ఖండించట్లేదు. దీంతో ఈ టైటిల్ ఫిక్స్ అనే భావనకు అందరూ వచ్చేసారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ టైటిల్ కు జనాల నుండి రెస్పాన్స్ బాగుండడంతో దీన్నే ఫిక్స్ చేద్దామన్న భావనకు వచ్చేశారట. అందుకే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయడానికి ఫిల్మ్ ఛాంబర్ లో అప్లై చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

మరి ఇప్పటిదాకా వచ్చిన వార్తలకు, టైటిల్ రిజిస్టర్ కు అప్లై చేశారన్న వార్తలకు అధికారిక సమాచారం త్వరలో వచ్చే అవకాశముంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్ అతుల్ పనిచేయనున్నారని కూడా వార్తలు వచ్చాయి. కాకపోతే దీనిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. దేవి శ్రీ ప్రసాద్ తో తన కెరీర్ మొదలునుండి పనిచేస్తున్న కొరటాల శివ ఈ చిత్రానికి మాత్రం దేవితో పనిచేయట్లేదు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All