Homeగాసిప్స్వరసగా సినిమాలను క్యాన్సిల్ చేస్తున్న గోపీచంద్

వరసగా సినిమాలను క్యాన్సిల్ చేస్తున్న గోపీచంద్

Gopichand scraps two of his films
Gopichand scraps two of his films

గోపీచంద్ కు యాక్షన్ హీరోగా టాలీవుడ్ లో మంచి పేరుంది. ఒకప్పుడు తన సినిమాలకు మినిమం గ్యారంటీ వసూళ్లు ఉండేవి. లిమిటెడ్ బడ్జెట్ లో చేస్తే గోపీచంద్ సినిమాలు మంచి లాభసాటి అయ్యేది. అయితే పరిస్థితిలో క్రమంగా మార్పు రావడం మొదలైంది. క్రమంగా గోపీచంద్ కు ప్లాపులు రావడం మొదలయ్యాయి. లౌక్యం తర్వాత గోపీచంద్ కు సరైన హిట్ లేదంటే పరిస్థితి ఎలా తయారైందో ఊహించుకోవచ్చు. తనకు తెలీకుండానే ఒక మూస ధోరణిలో ఉండిపోయాడు గోపీచంద్. ఒకే రకమైన సినిమాలను చేస్తూ రావడం వల్ల గోపీచంద్ కు ప్లాపుల మీద ప్లాపులు పడ్డాయి. ఎన్ని ప్లాపులు వస్తున్నా గోపీచంద్ తన తప్పును తెలుసుకోలేకపోయాడు. మూస ధోరణి నుండి బయటకు రాకుండా యాక్షన్ హీరో అన్న చట్రంలోనే ఉండి గోపీచంద్ చాలా పెద్ద తప్పు చేసాడు. రీసెంట్ గా గోపీచంద్ చేసిన పంతం, చాణక్య సినిమాలు దారుణమైన వసూళ్లను తెచ్చాయి. గోపీచంద్ మార్కెట్ మరీ ఇంత డౌన్ అయిపోయిందా అన్న సందేహాలు కలిగించాయి.

చాణక్య సినిమాకు అయితే థియేటర్ రెంటల్స్ కూడా రాని పరిస్థితి. దసరా సెలవుల్లో విడుదలైన ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ గా మిగిలింది. అయితే గోపీచంద్ కు ఉన్న ప్రధాన ప్లస్ పాయింట్ తనకు ఇంకా సినిమాలు వస్తుండడమే. చాణక్య విడుదల కాకముందే గోపీచంద్ మూడు సినిమాలను లైన్లో పెట్టేసాడు. అందులో ఒకటి సంపత్ నంది సినిమా కాగా మరొకటి నూతన దర్శకుడు బిను సుబ్రహ్మణ్యంతో సినిమా. దీనికి ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూసర్. భారీ బడ్జెట్ లో తెరకెక్కించబోయే యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని అన్నారు. కానీ గోపీచంద్ లో చాణక్య తర్వాత రియలైజేషన్ వచ్చినట్లు తెలుస్తోంది. వరసగా ఆరు ప్లాపులకు పైగా రావడంతో గోపీచంద్ లో మార్పు వచ్చింది.

- Advertisement -

సంపత్ నందితో సినిమా తప్పితే మిగతావన్నీ స్క్రాప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలకు కొంత కాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నాడట. లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాలు చేసి హిట్టు కొట్టి ముందు సరైన ట్రాక్ లోకి రావాలని ఈసారి కూడా ప్లాప్ కొడితే ఇక తనకు హీరోగా అవకాశాలు రావడం గగనమని గోపీచంద్ సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. దీంతో బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో తెరకెక్కాల్సిన యాక్షన్ థ్రిల్లర్ ఇక లేదని అనుకోవచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All