Homeటాప్ స్టోరీస్చాణక్య మూవీ రివ్యూ

చాణక్య మూవీ రివ్యూ

Chanakya Movie Review in Telugu
Chanakya Movie Review in Telugu

చాణక్య మూవీ రివ్యూ:
నటీనటులు :
గోపీచంద్, మెహ్రీన్
దర్శకత్వం : తిరు
నిర్మాత‌లు : రామ బ్రహ్మం సుంకర
సంగీతం : విశాల్ చంద్ర శేఖర్
సినిమాటోగ్రఫర్ : వెట్రి
విడుదల తేదీ: 5 అక్టోబర్ 2019
రేటింగ్ : 3/5

కెరీర్ పరంగా యాక్షన్ హీరో గోపీచంద్ ఇప్పుడు అత్యంత లో ఫేజ్ లో ఉన్నాడు. తన రీసెంట్ సినిమాలన్నీ ప్లాప్స్ గానే మిగిలాయి. ఈ నేపథ్యంలో నేడు స్పై థ్రిల్లర్ చాణక్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది కూడా సైరా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న తరుణంలో. మరి గోపీచంద్ ఉన్న ప్రతికూలతలను అధిగమించి హిట్ అందుకున్నాడా లేదా అన్ని చూద్దాం.

- Advertisement -

కథ :
అర్జున్ (గోపీచంద్) ఒక అండర్ కవర్ రా ఏజెంట్. అయితే రామకృష్ణ అనే ముసుగులో బ్యాంక్ ఎంప్లాయ్ గా పనిచేస్తుంటాడు. ఒకరోజు తన కొలీగ్స్ ను ఐఎస్ఐ టెర్రరిస్ట్స్ కిడ్నాప్ చేస్తారు. వారిని కాపాడాల్సిన బాధ్యత అర్జున్ పై పడుతుంది. మరోవైపు తన అండర్ కవర్ ముసుగు తొలగిపోవడంతో రా ఏజెంట్ గా ప్రభుత్వం తీసివేస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరి సపోర్ట్ లేకుండా అర్జున్ కరాచీ బయల్దేరతాడు. ఆ మిషన్ లో అర్జున్ తన స్నేహితులను కాపాడుకోగలిగాడా? లేదా వారిని కోల్పోయాడా అన్నది తెరమీదే చూడాలి.

నటీనటులు:
గోపీచంద్ కు ఉన్న ట్యాగ్ యాక్షన్ హీరో. తన సినిమాలు అన్నిట్లోనూ యాక్షన్ ప్రధానంగా ఉండేలా చూసుకుంటాడు. దానికి తగ్గట్లే ఇందులో రా ఏజెంట్ లా కనిపించాడు గోపీచంద్. ఏజెంట్ కు ఉండాల్సిన ఫిజిక్ తో ఆకట్టుకున్నాడు గోపీచంద్. తన వరకూ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు. మెహ్రీన్ తన క్యూట్ యాక్టింగ్ తో పాటు గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది. హీరో ఫ్రెండ్ గా ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించిన సునీల్, కొద్దిసేపు పెట్ డాగ్ డాక్టర్ గా కనిపించిన అలీ కామెడీ పండించే ప్రయత్నం సగమే విజయవంతమైంది. మొదటి సారి తెలుగులో నటించిన జరీన్ ఖాన్ కు మంచి పాత్ర పడింది. మిగిలిన వాళ్లంతా మామూలే. తమ పరిధి మేర నటించారు.

సాంకేతిక విభాగం:
సాంకేతికంగా చాణక్య మిశ్రమ అనుభూతి కలిగిస్తుంది. కథ ప్రకారం బాగున్నా, ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది. సాంకేతిక నిపుణుల గురించి ప్రస్తావిస్తే ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ వెట్రి గురించి. ఈ సినిమాకు తన పనితనంతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా స్పై ఆపరేషన్స్ వచ్చే సన్నివేశాల్లో కెమెరా వర్క్ బాగుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సాదాసీదాగా అనిపిస్తుంది. బాగున్న ఒకట్రెండు పాటలు కూడా రాంగ్ టైంలో వచ్చి చెడగొడతాయి. నేపధ్య సంగీతంలో ప్రత్యేకత ఏం లేదు. అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ కొన్ని చోట్ల ఆకట్టుకుంటాయి. రచయితగా, దర్శకుడిగా తిరు విఫలమయ్యాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అవసరానికి మించి ఖర్చు పెట్టించారు.

చివరిగా:
స్పై థ్రిల్లర్ అంటే ఎలా ఉండాలి? పాకిస్తాన్ వెళ్లి అక్కడ బడా టెర్రరిస్ట్ గా చలామణీలో ఉన్న వ్యక్తిని ఢీ కొట్టాలంటే ఎన్ని ప్రణాళికలు వేసుకోవాలి. కానీ చాణక్యలో అవేమి కనిపించవు. టైటిల్ చూస్తే ఇదేదో ఇంటెలిజెంట్ సినిమా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ హీరో చాలా సాదాసీదాగా ఆ టెర్రరిస్ట్ ఏదో మలక్ పేట్ సందుల్లో తిరిగే గూండాలా, హీరో ఏదో సాధారణ ఎస్ఐ అన్న ఫీలింగ్ వచ్చేలా చేసాడు దర్శకుడు. దీంతో మంచి సెటప్ కుదిరినా రైటింగ్ ఫెయిల్యూర్ వల్ల చాణక్య సాధారణ సినిమాగా మిగిలిపోయింది. చాలా సన్నివేశాలు లాజిక్ కు దూరంగా ఉండి విసిగిస్తాయి. సినిమా ఫస్ట్ హాఫ్ అలా అలా సాగిపోగా, సెకండ్ హాఫ్ పూర్తిగా సినిమాపై ఆసక్తిని నీరుగార్చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే చాణక్యతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వెళ్లాలన్న గోపీచంద్ ప్రయత్నం సఫలం కావడం చాలా కష్టం.

చాణక్య – సిల్లీ

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All