
“గోపీచంద్” పేరు వినపడక మనం అతని సినిమాలు చూడక చాలా రోజులు అయింది కదా, అయితే తన అభిమానులకి ఈ మధ్య సినిమాల మీద సినిమాలు అనౌన్స్మెంట్ చేయడం చూసాం. చాణక్య విడుదల డేట్ కూడా చెప్పండి అంటూ ఫ్యాన్స్ అందరూ వేడుకున్నారు మొత్తానికి సినిమా దసరా కానుకగా విడుదల అవుతుంది అని చెప్పారు కానీ డేట్ అయితే చెప్పలేదు.
ఇప్పుడు ఈ సినిమా వచ్చే నెల అనగా దసరా తర్వాత అక్టోబర్ 5 న విడుదల అవుతుంది అని సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసారు. కనుక దసరా బరిలో “చిరంజీవి” గారి “సైరా” సినిమాకి గోపీచంద్ గారి సినిమా ఒక్కటి ఫైనల్ అయింది.
ఇక చాణక్య విషయంలో అంచానాలు పెరగడానికి కారణం సినిమా ట్రైలర్, ట్రైలర్ లో చూస్తే మనకి సినిమా మీద బారి అంచనాలు పెరుగుతాయి. గోపిచంద్ గారి పవర్ ప్యాకెడ్ యాక్టింగ్ లెవెల్ మరోసారి సినిమాని దగ్గరగా తీసుకువెళ్తుంది అని నమ్మకంగా ఉన్నారు సినిమా సభ్యులు.
ఇక ఈ సినిమాలో గోపిచంద్ గారికి జంటగా, గత సంవత్సరం వచ్చిన “పంతం” సినిమా హీరోయిన్ “మెహ్రిన్ పిర్జాద” మరొకసారి జత కడుతుంది. సినిమాకి దర్శకత్వ బాధ్యతలు తమిళ దర్శకులు “తిరు” చేపట్టారు. నిర్మాతగా ఏ.కె. ఎంటర్టైన్మెంట్ నిర్మాణాలంలో రామ బ్రహ్మం సుంకర గారు భారీగా నిర్మించడం ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది. సంగీత దర్శకుడిగా విశాల్ చంద్రశేఖర్ గారు పాటలని రూపొందిస్తున్నారు.
మొత్తానికి దసరా కి సైరా రూపంలోనూ, ఇటు చాణక్యుడి రూపంలోనూ సినిమా ప్రియులకి ఎంటర్టైన్మెంట్ కొదువు లేదని ఇట్టే అర్ధం అవుతుంది, కనుక మనం కూడా ఆ రెండు సినిమాలకి బెస్ట్ అఫ్ లక్ చెప్పి వేచి చూద్దాం.