Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Mahesh Babu
Mahesh Babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ , ఈనెల 9 న మహేష్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మైక్రో టీజర్ ని అలాగే మహేష్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . నిజంగా ఇది మహేష్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే అంశమే మరి . మహేష్ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే .

ఆ చిత్రంలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు , ఇటీవలే కాశ్మీర్ లో తొలి షెడ్యూల్ కూడా పూర్తిచేసుకుంది సరిలేరు నీకెవ్వరు చిత్రం . రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోంది . ఆగస్టు 9 న మహేష్ పుట్టినరోజు కాబట్టి ఆరోజు ఫ్యాన్స్ కు పెద్ద పండగే ! అదే సమయంలో సరిలేరు నీకెవ్వరు మైక్రో టీజర్ , ఫస్ట్ లుక్ వస్తే మరింత సంతోషమే కదా !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All