Friday, March 24, 2023
Homeటాప్ స్టోరీస్నాన్ బాహుబలి రికార్డ్ ని బద్దలు కొట్టిన దేవరకొండ

నాన్ బాహుబలి రికార్డ్ ని బద్దలు కొట్టిన దేవరకొండ

geetha govindam creates non baahubali recordతమిళనాట నాన్ బాహుబలి రికార్డ్ ని బద్దలు కొట్టాడు విజయ్ దేవరకొండ . తమిళనాట తెలుగు చిత్రాలకు ఆదరణ బాగానే ఉంటుంది అయితే విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం మాత్రం 5 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది . టాలీవుడ్ టాప్ స్టార్స్ కే ఈ స్థాయి వసూళ్లు రాలేదు కానీ ఓ యంగ్ హీరో ఈ అరుదైన ఫీట్ ని అందుకోవడం నిజంగా గొప్ప విషయమే ! ఆగస్టు 15న విడుదలైన గీత గోవిందం చిత్రం చెన్నై లో పలు రికార్డులను బద్దలు కొట్టి నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది .

- Advertisement -

5 కోట్ల భారీ వసూళ్లతో బాహుబలి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు విజయ్ దేవరకొండ . పరశురామ్ దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన గీత గోవిందం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తుండటంతో ఆ చిత్ర బృందంతో పాటుగా బయ్యర్లు చాలా సంతోషంగా ఉన్నారు . విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ , రష్మిక మండన అందాలు గోపిసుందర్ సంగీతం పరశురామ్ టేకింగ్ వెరసి గీత గోవిందం ని అగ్రపథాన నిలబెట్టాయి .

English Title: geetha govindam creates non baahubali record

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts