Homeటాప్ స్టోరీస్ఈ రెండు బ్యానర్లు.. కలిసి బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు!

ఈ రెండు బ్యానర్లు.. కలిసి బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు!

Geetha arts and uv creations is a successful combo
Geetha arts and uv creations is a successful combo

టాలీవుడ్ లో సినీ నిర్మాణం భారమైపోతున్న రోజులివి. నిర్మాణ ఖర్చులు పెరిగిపోవడం దగ్గరనుండి, డిజిటల్ ప్రపంచం విస్తరించడం, థియేటర్ మెయింటెనెన్స్ పెరిగిపోవడం వంటి వివిధ కారణాల వల్ల నిర్మాతలకు మిగులుతుంది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ హౌస్ ను ఏళ్లకేళ్లు కొనసాగించడం అంటే సాధారణ విషయం కాదు. అయితే 1972లో స్థాపించిన గీతా ఆర్ట్స్ మాత్రం అప్రతిహితంగా సినిమాలను నిర్మించుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. ఎంత మంది కొత్త నిర్మాతలు వచ్చినా, సినిమాల సక్సెస్ రేట్ ఎంత తగ్గినా కానీ వీళ్ళ సినిమాలకు మాత్రం ఢోకా లేకుండా పోయింది. అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ లలో గీతా ఆర్ట్స్ కూడా ఉంది కాబట్టే ఇనేళ్ళుగా ఇండస్ట్రీలో టాప్ స్థాయిలో మనగలుగుతోంది. ట్రెండ్ కు తగ్గట్లు సినిమాలు తీస్తూ ప్రేక్షకులతో పాటు అల్లు అరవింద్ కూడా అప్డేట్ అవుతుండడం వల్లే గీతా ఆర్ట్స్ సంస్థకు ఇంత సక్సెస్ రేట్.

మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా నిర్మాణ సంస్థలు రెండు లేదా మూడు కలిసి సినిమాలు నిర్మిస్తున్నాయి. అలా గీతా ఆర్ట్స్ సంస్థ, మరో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తో కలిసి సినిమాలు నిర్మిస్తూ వస్తోంది. యూవీ క్రియేషన్స్ కోసం అతి తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ. మిర్చితో మొదలైన ఈ సంస్థ ప్రస్థానం, రన్ రాజా రన్ నుండి.. సాహో వరకూ కొనసాగుతోంది. ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న జాన్ చిత్రానికి కూడా యూవీనే నిర్మాణ సంస్థ.

- Advertisement -

గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ కలిసి ఇప్పటివరకూ మూడు సినిమాలు నిర్మించగా మూడు కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అవ్వడం విశేషం. ముందుగా వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రం భలే భలే మగాడివోయ్. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీ వాలా చిత్రం వెనుక కూడా గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతిరోజూ పండగేను కూడా అల్లు అరవింద్, వంశి ప్రమోద్ లు కలిసి నిర్మించారు. యావరేజ్ రేటింగ్స్ తో మొదలైన ఈ చిత్రం ఇప్పుడు లాభాల్లోకి వెళ్ళింది. సంక్రాంతి సినిమాల హంగామా మొదలవ్వడానికి ఇంకా సమయం ఉండడంతో ఈలోగా ప్రతిరోజూ పండగేదే హవా అంతా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All