
ఎవరైనా తన సినిమాలు చూడండి చెబుతారు కానీ చూడొద్దని ప్రచారం చేసే వారు ఎవరైనా వుంటారా? అంటే తానున్నానని అంటున్నారు దర్శకుడు గౌతమ్ మీనన్. ఆయన తెరకెక్కించిన రెండు ప్రేమకథ చాత్రాలు `సాహసం శ్వాసగా సాగిపో`, `ఎంత వాడు గానీ..`. ఈ రెండు చిత్రాల్ని చూడొద్దని గౌతమ్ మీనన్ చెబుతున్నాడు. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది.
21 రోజులు పూర్తి కాకముందే కరోనా ప్రభావం దేశంలో తగ్గకపోవడంతో మే 3 వరకు లాక్ డౌన్‌ని పొడిగించారు. తెలంగాణలో మాత్రం మరో నాలుగు రోజులు పొడిగించడంతో మే 7తో లాక్ డౌన్ పిరియాడ్ ముగిపనుంది. ఇదిలా వుంటే ఈ లాక్ డౌన్ పిరియడ్‌తో అంతా ఇంటి పట్టునే వుంటూ తమకు నచ్చిన పని చేస్కతున్నారు. సెలబ్రిటీలు చిత్ర విచిత్రమైన ఫీట్‌లు చేస్తున్నారు. ఆ వీడియోలని సోషల్ మీడియా ఇన్ స్టాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ క్వారెంటైన్‌టైమ్‌లో సామాన్యులంతా ఇంటి పట్టునే వుంటూ సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
అయితే ఈ లాక్ డౌన్ పిరియడ్‌లో `సాహసం శ్వాసగా సాగిపో`, `ఎంత వాడు గానీ..`. ఈ రెండు చిత్రాల్ని చూడొద్దని గౌతమ్ మీనన్ అంటున్నారు. కారణం ఈ రెండు చిత్రాల్లో హీరోలు వివిధ ప్రాంతాలకు టూర్‌లకు వెళ్లడమే. ఈ సమయంలో ఇలాంటి చిత్రాలు చూస్తే ప్రేక్షకులకు కూడా అలాగే బయటికి వెళ్లాలన్న కోరిక పుడుతుంది. అందుకే తన సినిమాలు చూడొద్దని సూచిస్తున్నట్టు గౌతమ్ మీమన్ వెల్లడించిడం ఆకట్టుకుంటోంది.