Homeటాప్ స్టోరీస్షాకింగ్ : బిగ్‌బాస్ 4 నుంచి గ‌ంగ‌వ్వ ఇంటిదారి ప‌ట్టింది!

షాకింగ్ : బిగ్‌బాస్ 4 నుంచి గ‌ంగ‌వ్వ ఇంటిదారి ప‌ట్టింది!

షాకింగ్ : బిగ్‌బాస్ 4 నుంచి గ‌ంగ‌వ్వ ఇంటిదారి ప‌ట్టింది!
షాకింగ్ : బిగ్‌బాస్ 4 నుంచి గ‌ంగ‌వ్వ ఇంటిదారి ప‌ట్టింది!

యూట్యూబ్ సంచ‌ల‌నం గంగ‌వ్వ‌… అనూహ్యంగా బిగ్‌బాస్ సీజ‌న్ 4లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన గంగ‌వ్వ ఈ వారం బ‌య‌టికి వ‌చ్చేస్తోంది.  ఎలాంటి చ‌దువులేక‌పోయినా అసాధ్యం అనుకున్న ఊహించ‌ని స్థాయిలో సెల‌బ్రిటీగా మారింది. క‌ష్టాల దారిలో బ్ర‌తుకీడుస్తూ లైఫ్‌ మొత్తం క‌న్నీళ్ల‌తో నిండిన గంగ‌వ్వ జీవితం `మై విలేజ్ షో`తో స‌రికొత్త మ‌లుపు తిరిగింది. అదే ఆమెని స్టార్‌ని చేసింది. బిగ్‌బాస్ సీజ‌న్ 4 లో ఎంట‌ర‌య్యేలా చేసింది.

యావ‌త్ దేశ వ్యాప్తంగా ఈ షో చూస్తున్న వారికి, ఈ షో గురించి తెలుసుకున్న వారికి గంగ‌వ్వ ఓ అద్భుతం. చ‌దువుకున్న వాళ్లు, ఇప్ప‌టికే ఫీల్డ్‌లో వున్న వాళ్ల‌కు కూడా ద‌క్క‌ని బిగ్‌బాస్ ఎంట్రీ గంగ‌వ్వ‌కు ద‌క్క‌డంతో అంతా ఆశ్చ‌ర్యంతో ఆమెని చూడ‌టం మొద‌లుపెట్టారు. సెప్టెంబ‌ర్ 6న మొద‌లైన బిగ్బాస్ షో క్ర‌మ క్ర‌మంగా ఆస‌క్తిని పెంచడం మొద‌లు పెట్టింది.

- Advertisement -

ఐదు వారాలుగా సాగుతున్న ఈ షోలో రోబో టాస్క్‌లో యాక్టీవ్‌గా పాల్గొన్న గంగ‌వ్వ గ‌త వారం నుంచి నీర‌సంగా క‌నిపిస్తోంది. అనారోగ్యం, వ‌య‌సు 59 కావ‌డంతో ప్ర‌స్తుత వాతావ‌ర‌ణానికి, బిగ్‌బాస్ హౌస్ సెంట్ర‌ల్ ఏసీకి త‌ట్టుకోలేక‌పోతోంది. దీంతో త‌న గుండె త‌ట్టుకోలేక‌పోతోంద‌ని, త‌న‌ని ఇంటికి పంపించండ‌ని నాగార్జున ముందు బోరున విల‌పించింది. దీంతో గంగ‌వ్వ ఆరోగ్య కార‌ణాల దృష్ట్యా ఆమెని బ‌య‌టికి పంపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ శ‌నివారం గంగ‌వ్వ బిగ్‌బాస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేస్తోంది. ఎలిమినేట్ అయి ఈ షో నుంచి ఇప్ప‌టికి న‌లుగురు కంటెస్టెంట్‌లు బ‌య‌టికి వ‌చ్చారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All