Homeటాప్ స్టోరీస్నాని అసలు స్టామినా తెలిసేది ఇప్పుడే

నాని అసలు స్టామినా తెలిసేది ఇప్పుడే

నాని అసలు స్టామినా తెలిసేది ఇప్పుడే
నాని అసలు స్టామినా తెలిసేది ఇప్పుడే

న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకులు విభిన్నమైన రెస్పాన్స్ ఇచ్చారు. అటు సినిమా చెత్తగా ఉందనీ చెప్పలేదు, అలా అని సినిమా సూపరు అని కూడా అనలేదు. రివ్యూలన్నీ మధ్యస్థంగానే వచ్చాయి. మొదటి రోజు వసూళ్లు డీసెంట్ గానే వచ్చే అవకాశాలున్నాయి. రివ్యూల సంగతి అలా ఉంటే ప్రముఖ టికెటింగ్ పార్ట్నర్ బుక్ మై షోలో మాత్రం 89 శాతం రేటింగ్ వచ్చింది. అది కూడా 10 వేల మందికి పైగా ఓట్లు వేశారు.

రివ్యూలు సూపర్ పాజిటివ్ గా రాకపోవడం, బుకింగ్స్ కూడా మరీ సూపర్ గా లేకపోవడం వంటి అంశాలు గ్యాంగ్ లీడర్ కు పని చేస్తాయా లేక నాని స్టామినాతో సినిమాను విజయతీరాలకు చేరుస్తాడా అన్నది చూడాల్సి ఉంటుంది. నిజానికి గ్యాంగ్ లీడర్ వసూలు చేయాల్సింది 30 కోట్లకు పైనే. ఇప్పుడున్న పరిస్థితులలో అదంత ఈజీ వ్యవహారం కాదు. నిజంగా ఈ సినిమా హిట్ అయితే మాత్రం అందులో మేజర్ క్రెడిట్ నానికే దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All