
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ గద్దలకొండ గణేష్ కు ఫస్ట్ నుండి రివ్యూలు పాజిటివ్ గా వచ్చాయి. మొదటి రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకుంటే ఈ చిత్రం 5.67 కోట్ల షేర్ రాబట్టింది. ఇవి చాలా మంచి నంబర్స్ అని చెప్పవచ్చు.
టాక్ బాగుంది కాబట్టి వీకెండ్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రఫ్ఫాడిస్తుందని చెప్పవచ్చు. ఇక సైరా విడుదలయ్యే దాకా గద్దలకొండ గణేష్ దే రాజ్యం. ఎంత వీలయితే అంత రాబట్టుకోవచ్చు. వీకెండ్ ఎలాగూ మంచి నంబర్స్ వస్తాయి అని అంచనాలున్నాయి కానీ సోమవారం నుండి ఈ చిత్రం ఎలా పెర్ఫర్మ్ చేస్తుంది అన్న దాని బట్టి ఈ సినిమా హిట్ స్టేటస్ గురించి తెలుస్తోంది. మొదట వాల్మీకి టైటిల్ గా ఉన్న ఈ చిత్రం వివాదాల కారణంగా గద్దలకొండ గణేష్ గా మార్చబడింది. హరీష్ శంకర్ దర్శకుడు.
గద్దలకొండ గణేష్ డే 1 బ్రేకప్ లిస్ట్ ఇక్కడ చూడండి :
ప్రాంతం షేర్ (కోట్లలో)
——————– —————————————-
నైజాం 1.65
సీడెడ్ 0.82
నెల్లూరు 0.25
కృష్ణ 0.42
గుంటూరు 0.71
వైజాగ్ 0.70
తూర్పు గోదావరి 0.54
వెస్ట్ గోదావరి 0.58
టోటల్ 5.67