Homeటాప్ స్టోరీస్అరుణ్ జైట్లీ పరిస్థితి విషమం

అరుణ్ జైట్లీ పరిస్థితి విషమం

Arun Jaitley
Arun Jaitley

మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించింది . ఈనెల 9 న జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎయిమ్స్ లో చేర్పించారు . కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అరుణ్ జైట్లీ ఐసియు లో చికిత్స పొందుతున్నాడు . అయితే సీనియర్ డాక్టర్లు అందిస్తున్న చికిత్సకు జైట్లీ శరీరం అంతగా సహకరించకపోవడంతో భయాందోళనకు లోనౌతున్నారు జైట్లీ కుటుంబ సభ్యులు .

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలలో పలు శాఖలను సమర్దవంతంగా నిర్వహించిన పేరుంది అరుణ్ జైట్లీ కి . ఎన్నికలకు ముందు చికిత్స కోసం అమెరికా వెళ్లి వచ్చాడు కూడా . అయితే అమెరికాలో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయలేదు అలాగే మళ్ళీ కేంద్ర మంత్రిగా పదవి చేపట్టలేదు . అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ , కేంద్ర వైద్యారోగ్య మంత్రి హర్షవర్ధన్ లు ఎయిమ్స్ కు చేరుకొని జైట్లీ ని పరామర్శించారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All