Homeటాప్ స్టోరీస్ఎట్టకేలకు లక్ష్య షూటింగ్ పూర్తి

ఎట్టకేలకు లక్ష్య షూటింగ్ పూర్తి

ఎట్టకేలకు లక్ష్య షూటింగ్ పూర్తి
ఎట్టకేలకు లక్ష్య షూటింగ్ పూర్తి

యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నా కానీ ప్రస్తుతం మల్టీపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. రొమాంటిక్ డ్రామా వరుడు కావలెను చిత్రాన్ని పూర్తి చేసిన నాగ శౌర్య, స్పోర్ట్స్ డ్రామా కూడా చేస్తోన్న విషయం తెల్సిందే.

కొత్త దర్శకుడు సంతోష్ జాగర్లపూడిను పరిచయం చేస్తూ నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు నిర్మిస్తోన్న చిత్రం లక్ష్య. ఈ సినిమా కోసం నాగ శౌర్య పూర్తిగా మేకోవర్ కు వెళ్ళాడు. తన బాడీని బాగా కష్టపెట్టి సిక్స్ ప్యాక్ తో పాటు కండలు తిరిగిన దేహాన్ని సాధించాడు.

- Advertisement -

లక్ష్యలో విలుకాడి పాత్రలో కనిపిస్తాడు శౌర్య. గతేడాది ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా జాప్యమవుతూ వచ్చింది. అయితే మొత్తానికి లక్ష్య షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటించింది.

లక్ష్యలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు కీలక పాత్రను పోషిస్తున్నాడు. కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీపై అధికారిక సమాచారం వస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All