Homeటాప్ స్టోరీస్ఫీల్ గుడ్ ఫ్యామిలీఎంటర్టైనర్ 'ఉండి పోరాదే' సెన్సార్ పూర్తి, ఆగష్టు 31న గ్రాండ్ రిలీజ్

ఫీల్ గుడ్ ఫ్యామిలీఎంటర్టైనర్ ‘ఉండి పోరాదే’ సెన్సార్ పూర్తి, ఆగష్టు 31న గ్రాండ్ రిలీజ్

Feel Good Family Entertainer 'Undi Pahode' Sensor Completed, Grand Release on August 31
Feel Good Family Entertainer ‘Undi Pahode’ Sensor Completed, Grand Release on August 31

ఫీల్ గుడ్  ఫ్యామిలీఎంటర్టైనర్  ‘ఉండి పోరాదే’ సెన్సార్ పూర్తి, ఆగష్టు 31న గ్రాండ్ రిలీజ్.

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మాతగా నవీన్ నాయని దర్శకత్వంలో  తరుణ్ తేజ్ ,లావణ్య హీరోహీరోయిన్లుగా రూపొందిన ఫీల్ గుడ్  ఫ్యామిలీ ఎంటర్టైనర్  ‘ఉండి పోరాదే‘.  ఇప్పటికే  రిలీజ్ అయినా  టీజర్, సాంగ్స్ కి విశేష స్పందన రాగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో  ఆడియన్స్ తో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సింగల్ కట్ కూడా లేకుండా  యూ ఏ సర్టిఫికెట్ పొందింది.. ఆగష్టు 31 న గ్రాండ్ గా విడుదలవుతుంది.. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత డా. కె లింగేశ్వర్ మాట్లాడుతూ – ”   మా ‘ఉండి పోరాదే‘ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యూ ఏ పొందింది. సెన్సార్ వారు సింగల్ కట్ కూడా లేకుండా ఈ మధ్యకాలంలో ఒక  మంచి సినిమా చూశాం అని.. నన్ను మా టీమ్ ను అభినందించారు.    నేను గ‌తంలో చెప్పిన‌ట్టు సినిమా 100ప‌ర్సెంట్ స‌క్సెస్ అవుతుంది అనే కాన్ఫిడెంట్  మరింత పెరిగింది. ఈ సినిమాలో  నటీనటులు అంద‌రూ కొత్త‌వారే అయినా ..సినిమా క‌థ‌ను నమ్మి ఈ సినిమా నిర్మించాను. లాస్ట్ 20 మినిట్స్ లో మన ప‌క్క‌న  ఉన్న‌వారిని కూడా మ‌ర్చి పోయేలా సినిమా ఉంటుంది.  ఫ్యామిలీకి సంబంధించి  ఒక   అద్భుత‌మైన క‌థాంశంలో ద‌ర్శ‌కుడు న‌వీన్ ప్ర‌తి ఫ్రేమ్ ఒక ఎక్స్‌పీరియ‌న్స్‌డ్ డైరెక్ట‌ర్ లాగా తీశారు.  అలాగే మా ఎడిట‌ర్ జె.పి గారు, డిఓపి  శ్రీనివాస్  చాలా స‌పోర్ట్ చేశారు.  హీరోహీరోయిన్లు   తరుణ్ తేజ్, లావణ్య  వారి కోస‌మే ఈ సినిమా పుట్టిందా? అనేంత‌ పోటా పోటిగా న‌టించారు.   ఈ సినిమాలో న‌టించిన అంద‌రి కెరీర్లో ఇది బెస్ట్ మూవిగా నిలిచిపోతుంది అనే నమ్మకం ఉంది.  ఆగష్టు 31 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం.  అంద‌రూ థియేటర్ లో  సినిమా చూసి పెద్ద స‌క్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను“అన్నారు.
ద‌ర్శ‌కుడు న‌వీన్ నాయ‌ని మాట్లాడుతూ  – ‘ఇంత మంచి  సినిమా చేసే అవ‌కాశం ఇచ్చిన నిర్మాత లింగేశ్వ‌ర్ గారికి థాంక్స్. సినిమా మేము అనుకున్న దానిక‌న్నా హార్ట్ ట‌చింగ్ గా వచ్చింది. ఈ సినిమాకు ప్ర‌తి టెక్నీషియ‌న్ 100ప‌ర్సెంట్ ఎఫ‌ర్ట్ పెట్టారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని ఆగష్టు 31 మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను “ అన్నారు.
సినిమాటోగ్రాఫర్: శ్రీనివాస్ విన్నకోట, మాటలు: సుబ్బారాయుడు బొంపెం, ఎడిటర్: జె.పి, ఫైట్స్: రామ్ సుంకర, నబ, సుబ్బు, మ్యూజిక్ : సాబు వర్గీస్, ఆర్ ఆర్: యెలెందర్ మహావీర్, నిర్మాత : డా. కె. లింగేశ్వర్: స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నవీన్ నాయని.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All