Friday, September 30, 2022
Homeటాప్ స్టోరీస్జూన్ 23న `ఉండిపోరాదే ` ఆడియో విడుద‌ల‌

జూన్ 23న `ఉండిపోరాదే ` ఆడియో విడుద‌ల‌

Undiporade release on June 23
Undiporade released on June 23

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌వీన్ నాయ‌ని ద‌ర్శ‌క‌త్వంలో డా.లింగేశ్వ‌ర్ నిర్మిస్తోన్న చిత్రం `ఉండిపోరాదే`. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుపుకుంటోంది. స‌బు వ‌ర్గీస్ అందించిన ఆడియో ఇటీవ‌లే క‌న్న‌డ కి సంబందించిన ఆడియో ని బెంగ‌ళూర్ లో విడుద‌ల చేశాము. తెలుగు లో ఈ నెల 23న విడుద‌ల చేయ‌టానికి నిర్మాత డా,లింగేశ్వ‌ర్ గారు స‌న్నాహ‌లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జులై నెలాఖ‌రుకి విడుద‌ల చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

సంగీత ద‌ర్శ‌కుడు స‌బు వ‌ర్గీస్ మాట్లాడుతూ…“ఇందులో ప్ర‌తి పాట సంద‌ర్భానుసారంగా సాగేదే. ద‌ర్శ‌క నిర్మాత‌లు పూర్తి స్వేచ్ఛ‌నివ్వ‌డంతో మంచి పాట‌లు ఇవ్వ‌గ‌లిగాను` ఈ ఆడియో ని జూన్ 23న విడుద‌ల చేయ‌టానికి మా నిర్మాత డా.లింగేశ్వ‌ర్ గారు స‌న్నాహ‌లు చేస్తున్నారు` అన్నారు.

ద‌ర్శ‌కుడు న‌వీన్ నాయని మాట్లాడుతూ…“న‌న్ను న‌మ్మి డైర‌క్ట‌ర్ గా అవ‌కాశం ఇచ్చిన మా నిర్మాత‌కు లైఫ్ లాంగ్ రుణ‌ప‌డి ఉంటాను. ఇదొక రియ‌లిస్టిక్ స్టోరి. ప‌క్కింటి అమ్మాయి జీవితం చూసిన‌ట్టుగా సినిమా ఉంటుంది. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల మ‌ధ్య సాగే ఎమోష‌నల్ గా, మ‌న‌సులు క‌దిలించే సాంగ్ వుంది. ఇటీవ‌లే క‌న్న‌డ లో మా ఆడియో విడుద‌ల‌య్యింది. కేదార్ శంక‌ర్‌, అజ‌య్ ఘోష్ ల పాత్ర‌లు సినిమాకు హైలెట్ గా ఉంటాయి. మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారని ఆశిస్తున్నా“ అన్నారు.

నిర్మాత డా.లింగేశ్వ‌ర్ మాట్లాడుతూ…“నేను విడుద‌ల‌య్యే ప్ర‌తి సినిమా చూస్తూ దాని గురించి అనాల‌సిస్ చేసేవాణ్ని. ఇక నేనే సినిమా చేస్తున్న‌ప్పుడు ఎంత కేర్ తీసుకుంటానో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అలాగే ఆడియో విష‌యం లో చాలా జాగ్ర‌త్త తీసుకున్నాం. స‌బు వ‌ర్గీస్ అందించిన ఆడియో ని ఈ నెల 23న విడ‌దుల చేస్తున్నాము. ఇటీవ‌లే క‌న్న‌డ లో కూడా ఆడియో ని విడుల చేశాము. ఇంత వ‌ర‌కు తెర పై రాన‌టువంటి క‌థ ఇది. మా సినిమాకు, సుద్దాల అశోక్ తేజ గారు నాన్న పై రాసిన పాట‌కు అవార్డ్స్ వ‌స్తాయ‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌తి త‌ల్లీదండ్రితో పాటు పిల్ల‌లంద‌రూ చూడాల్సిన సినిమా ఇది. ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌ను గుర్తు చేసే సినిమా. మ‌ధ్యలో ఎంత మంది వ‌చ్చినా చివ‌రి వ‌ర‌కు మ‌న‌ల్ని ప్రేమించేది మాత్రం త‌ల్లిదండ్రులే అనే సందేశం మా సినిమా ద్వారా ఇస్తున్నాం. విలువ‌లు, బాంధవ్యాలు చూపిస్తూనే క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడించాం. పెద్ద సింగ‌ర్స్ తో పాట‌లు పాడించాం. “ అన్నారు.

త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య‌, సిద్ధిక్ష‌, అజ‌య్ ఘోష్‌, సీనియ‌ర్ సూర్య‌, సుజాత‌, రూపిక‌, స‌త్య కృష్ణ‌, కేదార్ శంక‌ర్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్ః శ్రీను విన్న‌కోట‌; స్టంట్స్ః రామ్ సుంక‌ర‌; స‌ంగీతంః స‌బు వ‌ర్గీస్; లిరిక్స్ః సుద్దాల అశోక్ తేజ‌, డా.లింగేశ్వ‌ర్, వ‌న‌మాలి, రామాంజ‌నేయులు; పి ఆర్ ఓ .. ఏలూరు శ్రీను, కొరియోగ్రాఫ‌ర్ః న‌రేష్ ఆనంద్‌; నిర్మాతః డా.లింగేశ్వ‌ర్; ద‌ర్శ‌కత్వంః న‌వీన్ నాయ‌ని.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts