Homeటాప్ స్టోరీస్శాటిలైట్ రైట్స్ లో సంచలనం సృష్టించిన బెల్లంకొండ

శాటిలైట్ రైట్స్ లో సంచలనం సృష్టించిన బెల్లంకొండ

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ” రాక్షసుడు ” , తమిళంలో సంచలన విజయం సాధించిన రాత్ససన్ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడు గా రీమేక్ చేస్తున్నారు . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా అనుపమా పరమేశ్వరన్ బెల్లంకొండ సరసన నటిస్తోంది . రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ భారీ ధర పలికి సంచలనం సృష్టిస్తోంది .

- Advertisement -

తెలుగు , హిందీ డబ్బింగ్ రైట్స్ రెండూ కలిపి మొత్తం 18 కోట్లకు పైగా డీల్ కుదిరినట్లు తెలుస్తోంది . శాటిలైట్ తెలుగు హక్కుల కోసం 6 కోట్లకు హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం 12 కోట్లకు పైగా చెల్లిస్తున్నట్లుగా సమాచారం . దాంతో మేకింగ్ డబ్బులు దాదాపుగా ఇక్కడే వస్తున్నట్లు తెలుస్తోంది . తమిళంలో సంచలన విజయం సాధించిన చిత్రం కావడంతో తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ .

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All