Thursday, October 6, 2022
Homeటాప్ స్టోరీస్షాకిస్తున్న‌`పుష్ప‌` విల‌న్ రెమ్యున‌రేష‌న్?

షాకిస్తున్న‌`పుష్ప‌` విల‌న్ రెమ్యున‌రేష‌న్?

షాకిస్తున్న‌`పుష్ప‌` విల‌న్ రెమ్యున‌రేష‌న్?
షాకిస్తున్న‌`పుష్ప‌` విల‌న్ రెమ్యున‌రేష‌న్?

మ‌ల‌యాళ చిత్రాల‌కు, మ‌ల‌యాళ న‌టుల‌కు తెలుగులో ప్రాధాన్య‌త పెరుగుతోంది. ప్ర‌స్తుతం స్టార్ హీరోలు మ‌ల‌యాళ రీమేక్ చిత్రాల్లో న‌టిస్తున్నారు. వారి చిత్రాల్లో మ‌ల‌యాళ న‌టుల్ని ప్ర‌ధాన పాత్ర‌ల కోసం ఎంపిక చేసుకుంటూ వారికి ప్ర‌ధాన్య‌త నిస్తున్నారు. తాజాగా మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ తెలుగు చిత్రం `పుష్ప‌`తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఊర మాస్ పాత్ర‌లో లారీడ్రైవ‌ర్‌గా , గంధ‌పు చ‌క్క‌ల స్ల‌గ్ల‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు.

- Advertisement -

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ కోసం మెయిన్ విల‌న్‌గా ఫ‌హ‌ద్ ఫాజిల్‌ని ఎంపిక చేసిన‌ట్టు తాజాగా చిత్ర బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మ‌ల‌యాళంలో హీరోగా న‌టిస్తున్న ఫహ‌ద్ ఫాజిల్ తెలుగులో విల‌న్‌గా ఈ మూవీలో న‌టిస్తున్నారు. ఇందు కోసం ఆయ‌న భారీ పారితోషికం డిమాండ్ చేసిన‌ట్టు తెలిసింది. 5 కోట్లు డిమాండ్ చేశార‌ని, అందుకు మేకర్స్ అంగీక‌రించి జీఎస్టీతో క‌లిపి రెమ్యున‌రేష‌న్ ని మేక‌ర్స్ అంద‌జేసిన‌ట్టు తెలిసింది.

ఈ షాకింగ్ అమౌంట్ తెలిసిన వాళ్లంతా ఈ స్థాయిలో పారితోషికం అందుకున్న మ‌ల‌యాళ న‌టుల్లో ఫ‌హ‌ద్ మొద‌టి వ‌రుస‌లో నిలిచార‌ని అంటున్నారు. స్టోరీ న‌చ్చితేనే సినిమా చేసే ఫ‌హ‌ద్ కు `పుష్ప‌` స్టోరీ లైన్ న‌చ్చ‌డం వ‌ల్లే ఇందులో విల‌న్‌గా న‌టించ‌డానికి అంగీక‌రించార‌ట‌. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 13న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts