Homeటాప్ స్టోరీస్కరోనా కడతేరక ముందే మరో వైరస్.. నిజమేంటి?

కరోనా కడతేరక ముందే మరో వైరస్.. నిజమేంటి?

కరోనా కడతేరక ముందే మరో వైరస్.. నిజమేంటి?
కరోనా కడతేరక ముందే మరో వైరస్.. నిజమేంటి?

చైనా నుండి దిగుమతైన కరోనా వైరస్ ప్రపంచం మొత్తమ్మీద ఎన్ని అరాచకాలు సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైనా నుండి మొదలైన ఈ వైరస్ క్రమంగా అగ్ర దేశాలకు పాకింది. అటు నుండి ప్రస్తుతం దాదాపు అన్ని దేశాల్లో ఈ వైరస్ తాలూకు లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్, అమెరికా దేశాల్లో  కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజూ వేలల్లో నమోదవుతోంది. ఇటలీలో అయితే రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది. 500, 600 దాటి ఒక రోజుకి దాదాపు 800 మరణాలు నమోదవుతున్నాయి. దీంతో ఇటలీ ప్రభుత్వం కూడా చేతులెత్తేయాల్సిన పరిస్థితికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమైంది. వేల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇంకా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో చైనాలో మరో కొత్త వైరస్ అంటూ నిన్నటి నుండి వస్తున్న పుకార్లతో ప్రపంచం బెంబేలెత్తిపోతోంది.

అసలింతకీ ఆ వైరస్ ఏంటి? దాని లక్షణాలు ఏంటో చూద్దాం. చైనాలో నిన్న వెలుగు చూసింది అని చెబుతున్నది హాంటా వైరస్. ఇది కూడా చైనాలోనే పుట్టిందని అంటున్నారు. అయితే ఇది ఒక రకమైన ఎలుకలను తింటే వచ్చే వైరస్. 1951-53 మధ్య సమయంలో కొరియన్ యుద్ధంలో సైనికులను చంపేందుకు ఈ వైరస్ ను ఎక్కించిన మాంసాన్ని ఆహారంగా ఇచ్చేవారు. 1976లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

ఆ మధ్య చైనాలో ఈ వైరస్ బాగానే వ్యాపించింది. అయితే క్రమంగా తగ్గుముఖం పట్టింది కూడా. ఇప్పుడు మళ్ళీ ఒక వ్యక్తి ఈ వైరస్ కారణంగా చనిపోయాడు. ఈ వైరస్ ప్రాణాంతకమైనదే అయినా కూడా కచ్చితంగా మనుషుల నుండి మనుషులకు వ్యాపించే రకమైన వైరస్ కాదు. కేవలం ఎలుకలను తింటే వచ్చే వైరస్ ఇది. సో ఈ విషయంలో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. చైనా వాళ్ళ లాగా కనిపించిన జంతువునల్లా కాల్చి చంపుకుని తినే రకాలం కాదు కదా. అందుకే వాట్సాప్ లో వచ్చే ప్రతీ మెసేజ్ ను నమ్మకండి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All