Homeటాప్ స్టోరీస్జియోలో భారీ పెట్టుబ‌డులు పెడుతున్న‌ ఫేస్‌బుక్‌!

జియోలో భారీ పెట్టుబ‌డులు పెడుతున్న‌ ఫేస్‌బుక్‌!

జియోలో భారీ పెట్టుబ‌డులు పెడుతున్న‌ ఫేస్‌బుక్‌!
జియోలో భారీ పెట్టుబ‌డులు పెడుతున్న‌ ఫేస్‌బుక్‌!

ప్ర‌ముఖ భార‌తీయ టెలికం దిగ్గ‌జం జియో. ఇంత కాలం వున్న ఎయిర్ టెల్‌, ఐడియా, వొడా ఫోన్‌..ల‌ని వెన‌క్కి నెట్టి ఇండియాలో నెంబ‌ర్‌వ‌న్ టెలికం కంపెనీగా అవ‌త‌రించింది. అర్బ‌న్ నుంచి రూర‌ల్ ఏరియాస్ వ‌ర‌కు, మెట్రో న‌గ‌రాల నుంచి సిటీస్ వ‌ర‌కు దేశ వ్యాప్తంగా సేవ‌ల‌ని విస్త‌రించింది. దీంతో మిగ‌తా నెట్ వ‌ర్క్ ల‌న్నీ రెగ్యుల‌ర్ క‌స్ట‌మ‌ర్ల‌ని కోల్పోయి భారీ న‌ష్టాల్లో కూరుకుపోయాయి.

జియో.. రిల‌య‌న్స్ దిగ్గ‌జం ముఖేష్ అంబానీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన ఈ నెట్ వ‌ర్క్ ఇండియాలో టాప్ పీపుల్స్ నుంచి పూరి గుడిసెల్లో వుండే వారి దాకా విస్త‌రించింది. దీంత ఇండియాలోనే అత్య‌ధిక క‌స్ట‌మ‌ర్లు గ‌ల నెట్ వ‌ర్క్‌గా అవ‌త‌రించ‌డంతో దీనిపై జూక‌ర్ బ‌ర్గ్ కు చెందిన ఫేస్ బుక్ క‌న్ను ప‌డింది.
జీయోతో ప్ర‌ముఖ సామాజిక సంస్థ ఫేస్ బుక్ భారీ పెట్టుబ‌డులు పెట్ట‌బోతోంద‌ని తెలిసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా జియో నెట్ వ‌ర్క్ అధినేత ముఖేష్ అంబానీ వెల్ల‌డించారు. ఫేస్‌బుక్ టెలికం దిగ్గ‌జం జియోలో 9.99 శాంత వాటిని కొనుగోలు చేయ‌డానికి సిద్ధ‌మైన‌ట్టు సంస్థ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. దీని విలువ 43, 574 కోట్లు (5.7 బిలియ‌న్స్‌). ఈ మేర‌కు ఇరు సంస్థ‌లు ఈ ఒప్పందం గురించి ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేశాయి. తాజా వాటా కొనుగోలుతో జియోలో ఫేస్‌బుక్ అతి పెద్ద మైనారిటీ వాటాదారుగా నిల‌వ‌నుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All