Homeటాప్ స్టోరీస్ఈటీవీ వాళ్లకు ఇంత కాలానికి తత్త్వం బోధపడింది

ఈటీవీ వాళ్లకు ఇంత కాలానికి తత్త్వం బోధపడింది

ఎవరైనా అప్డేట్ అవుతారు కానీ ఈటీవి, రామోజీ రావు మాత్రం అప్డేట్ కారు అని టివి ప్రపంచంలో ఒక నానుడి ఉంది. ఈటీవి గ్రూపులో వ్యవహారం చాలా వింతగా ఉంటుంది. సెన్సేషనలిజం అంటే వాళ్లకు గిట్టదు. అసలు ఆ పదానికి అర్ధమే తెలియదన్నట్లుగా వారు ఉంటారు. ఈ కాలంలో న్యూస్ ఛానల్స్ ఎలా ఉంటాయి. సెన్సేషన్ ఎక్కడుంటే అక్కడ మఠం వేసుకుని కూర్చుంటాయి. టీఆర్పిల కోసం ఏమైనా చేస్తాయి. ఎంత దూరమైనా వెళ్తాయి. చర్చల కార్యక్రమం పేరుతో టివి స్టూడియోని రణరంగంగా మార్చడానికి కూడా సిద్ధమవుతాయి. ఇంకా ఇలాంటి గొడవలను దగ్గరుండి ప్రోత్సహిస్తాయి. ఇవన్నీ మిగతా ఛానల్స్ చేసే పని. కానీ ఈటివి న్యూస్ కథే వేరు. వాళ్ళ దగ్గర సెన్సేషన్ అంటే తెలియదు. టీఆర్పీల కోసం అర్ధం పర్ధం లేని ప్రోగ్రామ్స్ నిర్వహించరు. గొడవలు పడే చర్చా కార్యక్రమాలు అసలే కనిపించవు. వాళ్లదంతా పాత స్టైల్. ఇప్పటికీ ఈటీవి 9 పీఎం న్యూస్ ను ఇష్టపడే వాళ్ళున్నారు. ఇప్పటికీ రైతుల కోసం అన్నదాత కార్యక్రమాన్ని వేస్తారు వాళ్ళు. ఇలా ఈటీవి న్యూస్ దంతా పాత స్టైల్.

- Advertisement -

న్యూస్ ఛానల్ అనే కాదు, ఈటివి కార్యక్రమాలు కూడా అలాగే ఉంటాయి. ఎక్కడా హడావిడి అన్నదే లేకుండా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మిగతా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లా వాళ్ళు కొత్త సినిమాల కోసం కోట్లకు కోట్లు పోసి కొనుక్కోరు. వాళ్ళ దగ్గర ఉన్నదంతా పాత సినిమాల లైబ్రరీనే. రామోజీ రావు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ మీద నిర్మించిన సినిమాలు, ఇంకా పాత తెలుగు క్లాసిక్స్ ఎన్నో వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈటీవి వాళ్ళ దగ్గర ఉన్న సినిమాలు బయట ఎక్కడా మనకు దొరకవు. పైరసీ ప్రింట్ ఉండదు. యూట్యూబ్ లో దొరకవు. ఈటివికు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నా కానీ అందులో కూడా ఉండవు. ఈ మధ్య కొన్ని సినిమాలు అప్లోడ్ చేస్తున్నారు కానీ లేదంటే వాళ్ళు టివిలో వేసినప్పుడే చూడాల్సిన పరిస్థితి. ఇదివరకు అంటే జనాలు టీవీలు ఎక్కువ చూసేవారు కాబట్టి ఈ సిస్టం వర్కౌట్ అయింది. ఇప్పుడంతా డిజిటల్ యుగం కాబట్టి స్మార్ట్ ఫోన్ లో యాప్ వేసుకుని నచ్చిన సమయంలో నచ్చిన సినిమాను చూడటానికి అలవాటు పడిపోయారు జనాలు.

ఇప్పటివరకూ ఎంటర్టైన్మెంట్ రంగంలో కానీ, న్యూస్ రంగంలో కానీ సంప్రదాయబద్ధంగా ఉన్న ఈటివి ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతోంది. ఈటివి విన్ పేరిట ఒక యాప్ ను రూపొందించింది. తమ కంటెంట్ మొత్తం ఈ యాప్ లో ఉంటుందని తెలిపింది. ఈటివి వాళ్ళ దగ్గర ఎన్నో క్లాసిక్ సినిమాలు ఉన్నాయి. ముందు తరం వాళ్లకు ఇలాంటి సినిమాలు అన్నీ చూడటానికి ఇదే సరైన వేదిక. అయితే ఈ యాప్ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ విషయం ఇంకా తేలలేదు. లేదా మొత్తం ఫ్రీ పెట్టి యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తారేమో. ఏదేమైనా ఈటివి వాళ్ళు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలోకి వచ్చేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All