Thursday, November 24, 2022
Homeటాప్ స్టోరీస్మొన్న సూర్య గారిని కలిసారు...ఇప్పుడు రామోజీ రావు గారిని కలిసారు...కారణం?

మొన్న సూర్య గారిని కలిసారు…ఇప్పుడు రామోజీ రావు గారిని కలిసారు…కారణం?

మొన్న సూర్య గారిని కలిసారు...ఇప్పుడు రామోజీ రావు గారిని కలిసారు...కారణం?
మొన్న సూర్య గారిని కలిసారు…ఇప్పుడు రామోజీ రావు గారిని కలిసారు…కారణం?

బహుముఖ ప్రజ్ఞశాలి అయిన కలెక్షన్ కింగ్ ‘మోహన్ బాబు’ గారు ఈ మధ్య పథకం ప్రకారంగా అడుగులు వేస్తున్నారు. కారణం ఏమైనా కానీ మనకి ముందుగా క్లూ ఇస్తున్నారు. కుమారులు ఇద్దరు చేస్తున్న సినిమాలు మంచిగా ఆడటం లేదు నిర్మాతలు ముందుకి రావటం లేదు. కుమార్తె బుల్లితెర మీద మంచి ఆదరణ ఉన్న కార్యక్రమాలు చేసుకుంటుంది. మరి కుమారుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న మోహన్ బాబు గారు ఈ మధ్య బాగా వార్తల్లో నిలుస్తున్నారు.

- Advertisement -

ఒక 10 వారం రోజుల ముందు తమిళ హీరో ‘సూర్య’ గారిని ఇంటికి పిలిపించారు. భోజనానికి పిలిచారు అని అందరు అనుకున్నారు అలాగే సూర్య నటించిన ‘బందోబస్త్’ సినిమా ప్రమోషన్స్ కి వస్తే ఇలా అనుకోకుండా మోహన్ బాబు గారి కుటుంబాన్ని కలిసారు అని తెలిసింది అనుకున్నాం. కానీ కథలోకి వెళ్తే ‘సూర్య-సుధా కొంగర’ దర్శకత్వంలో రాబోతున్న ‘సూరారై పోట్రు’ సినిమాలో మోహన్ బాబు గారు ఒక పాత్ర చేస్తున్నారు అని అది కథలో కీలకం. అలా చేయబోయే సినిమాకోసం ముందుగా ఇద్దరు ఒకరికి ఒకరు పరిచయం పెంచుకోవాలి అనుకున్నారు అందుకే ఇంటికి పిలిపించారు అని అనుకున్నాం.

అంతే కాకుండా అలా కలిసిన వారు అదే రోజు మన దర్శకులు ‘బి.వి.ఎస్ రవి’ గారి దగ్గర ఉన్న ఒక కథని సూర్య గారికి వినిపించారు. సూర్య గారు ఆ కథ విని ఒకే చెప్పారు, కానీ డేట్స్ సర్దుపాటు చేసుకొని సినిమాని చేస్తాను అని మాట ఇచ్చారు. మరి ఆ సినిమాకి మోహన్ బాబు గారు నిర్మాతగా ఉంటారు అని అన్నారు. మరి అందులో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు. సూర్య గారిని ఇంటికి పిలవటం వెనుక ఇంత కారణం ఉంది. అలా అనుకున్న మోహన్ బాబు అభిమానులు ఇంకొక వార్త గురించి కూడా అలానే అనుకుంటున్నారు. అదేమిటి అంటే…..

ఈనాడు సంస్థల అధినేత మరియు ‘ఉషా కిరణ్ మూవీస్’ నిర్మాతలు అయిన ‘రామోజీ రావు’ గారిని మోహన్ బాబు గారు కలిసారు. వారితో విద్య, సినిమా, రాజకీయాల గురించి మాట్లాడినట్లు మోహన్ బాబు గారు మీడియా ముందు చెప్పారు. ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత ట్విట్టర్ లో రామోజీ రావు గారిని ఉద్దేశిస్తూ…”రామోజీ రావు గారు మారుతన్న తరాలకి చెరగని ఎన్‌సైక్లోపీడియా…ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను..ఆయనతో మాట్లాడిన మాటలు నేను మరిచిపోలేను అని అన్నారు”.

అప్పుడు సూర్య గారిని కలవడం వెనుక అంత కారణం ఉంటే…ఇప్పుడు కలిసిన రామోజీ రావు గారి విషయంలో కూడా పెద్ద ఎత్తున సినిమా గురించో? లేక రాజకీయాల గురించో? చర్చ జరుగుతుంది అని సినిమా విశ్లేషకులు అనుకుంటున్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts