HomeVideosఆర్ఆర్ఆర్ నుండి ‘ఎత్తర జెండా’ సాంగ్ ఫుల్ వీడియో విడుదల

ఆర్ఆర్ఆర్ నుండి ‘ఎత్తర జెండా’ సాంగ్ ఫుల్ వీడియో విడుదల

Etthara Jenda full video song
Etthara Jenda full video song

ఆర్ఆర్ఆర్ నుండి ‘ఎత్తర జెండా’ సాంగ్ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఇప్పటికే ‘నాటు నాటు, కొమ్మ ఉయ్యాల, దోస్తీ’ సాంగ్స్ ఫుల్ వీడియోలను విడుదల చేసి ఆకట్టుకోగా..ఈరోజు మంగళవారం ఎత్తర జెండా సాంగ్ ను రిలీజ్ చేశారు. వీడియోలో సీతా రామ రాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా తారక్ యాక్ట్ చేసిన లాస్ట్ సీన్ కనబడుతోంది. ‘‘యాన్ ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్ ’’ అనే స్టాంప్ కూడా పడుతుండటం చూసి సినీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను ఆయనతో పాటుగా విశాల్ మిశ్రా, శ్రుతి చాగంటి, హారిక నారాయణ్‌లు ఆలపించారు.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటను క్లైమాక్స్ తరువాత పెట్టడం ద్వారా.. క్లైమాక్స్ అయిపోయినా సరే.. ఈ పాట కోసం అలా కుర్చీలలో కూర్చుని ఉన్న అరుదైన సంఘటన RRR థియేటర్స్‌లో కనిపించింది. ఎత్తర జెండా అంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్ చిందేయడం.. అభిమానులకు కన్నుల పండుగగా అనిపిస్తుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు అలియా కూడా జతకలిసి స్టెప్‌లు వేయడం ఎత్తర జెండా సాంగ్‌కి అదనపు ఆకర్షణగా నిలిచింది.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All