Homeటాప్ స్టోరీస్ఎంత మంచివాడవురా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్

ఎంత మంచివాడవురా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్

ఎంత మంచివాడవురా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్
ఎంత మంచివాడవురా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ చిత్రం ఎంత మంచివాడవురా సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన విషయం తెల్సిందే. ఈ సంక్రాంతికి విపరీతమైన కాంపిటీషన్ ఉన్నా కానీ కళ్యాణ్ రామ్ ధైర్యంగా తన చిత్రాన్ని బరిలో వదిలాడు. అయితే ఈ చిత్రానికి తొలిరోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే సంక్రాంతి రోజున రిలీజ్ కావడంతో ఎంత మంచివాడవురా తొలి రెండు రోజులు మంచి కలెక్షన్స్ సాధించింది. అయితే టాక్ పాజిటివ్ గా లేకపోవడంతో మూడో రోజు నుండి ఈ సినిమా కలెక్షన్స్ లో క్లియర్ డ్రాప్ కనిపించింది. మొత్తంగా తొలివారం వసూళ్లు చూసుకుంటే ఎంత మంచివాడవురా 6.3 కోట్ల షేర్ ను మాత్రమే నమోదు చేయగలిగింది. ఈ సినిమాకు దాదాపుగా 10 కోట్ల మేర బిజినెస్ జరగ్గా ఇప్పటికి 60 శాతం మేర బిజినెస్ రికవర్ అయింది.

వర్కింగ్ డేస్ లో ఈ చిత్రానికి నామమాత్రపు కలెక్షన్స్ వస్తున్నాయి. నిన్న ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఈ వీకెండ్ మరో కొత్త సినిమా విడుదల ఉండడంతో ఎంత మంచివాడవురా 7 కోట్లకు అటూ ఇటూగా తన ఫుల్ ఫన్ ను ముగించే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

ఎంత మంచివాడవురా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :

నైజాం : 1.53 కోట్లు
సీడెడ్ : 81 లక్షలు
గుంటూరు : 67.2 లక్షలు
ఉత్తరాంధ్ర : 81.6 లక్షలు
తూర్పు గోదావరి : 94 లక్షలు
పశ్చిమ గోదావరి : 64.4 లక్షలు
కృష్ణ : 68.6 లక్షలు
నెల్లూరు : 22.5లక్షలు

ఆంధ్ర + తెలంగాణ : 6.32 కోట్లు

సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ కథానాయికగా నటించింది. నరేష్, తనికెళ్ళ భరణి, సుహాసిని, శరత్ బాబు, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All