Homeటాప్ స్టోరీస్ఎంత మంచివాడవురా మూవీ రివ్యూ

ఎంత మంచివాడవురా మూవీ రివ్యూ

Entha ManchiVaadavuraa Movie Review
Entha ManchiVaadavuraa Movie Review

మూవీ రివ్యూ: ఎంత మంచివాడవురా
నటీనటులు: కళ్యాణ్ రామ్, మెహ్రీన్ కౌర్, తనికెళ్ళ భరణి, సుహాసిని, శరత్ బాబు, విజయ్ కుమార్ తదితరులు
నిర్మాత: ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా
దర్శకత్వం: సతీష్ వేగేశ్న
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
మ్యూజిక్: గోపి సుందర్
రన్ టైం: 2 గంటల 24 నిముషాలు
విడుదల తేదీ: జనవరి 15, 2020

నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది 118 సినిమాతో డీసెంట్ విజయాన్ని అందుకున్నాడు. అయితే రేసులో బాగా వెనుకబడిన కళ్యాణ్ రామ్ తిరిగి మార్కెట్ సంపాదించుకోవాలంటే ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సొంతం చేసుకోవాలి. అందుకే సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేసుకుని పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ ఎంత మంచివాడవురా చిత్రాన్ని వదిలాడు. ఈరోజే ఈ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఉందో చూద్దామా.

- Advertisement -

కథ:
బాలు (కళ్యాణ్ రామ్) చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాధ. తనలా కుటుంబ సభ్యులు లేకుండా ఎవరూ బాధపడకూడదన్న ఉద్దేశంతో బాలు “ఆల్ ఈజ్ వెల్” అనే ఒక రిలేటివ్స్ సప్లయిర్ కంపెనీని మొదలుపెడతాడు. అంటే కొడుకు లేని వారిని కొడుకుగా, బ్రదర్ లేని వాళ్లకు ఒక బ్రదర్ లా, మనవడిని కోల్పోయిన తాతకు ఒక మనవడిగా భిన్న రోల్స్ ప్లే చేస్తుంటాడు కళ్యాణ్ రామ్. ఇదిలా ఉండగా రామశర్మ (తనికెళ్ళ భరణి)కి కొడుకుగా వాళ్ళింటికి వెళ్తాడు. అక్కడ గంగరాజు (రాజీవ్ కనకాల) రామశర్మను ఇబ్బంది పెడుతుంటే తనని జైల్లో పెట్టిస్తాడు.

ప్రతీకారంతో గంగరాజు రగిలిపోతుంటాడు. మరోవైపు రామశర్మకు బాలు తన అసలు కొడుకు కాదని తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో బాలు ఏం చేస్తాడు? గంగరాజు ప్రతీకారం వల్ల బాలు ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి? ఇందులో మెహ్రీన్ పాత్ర ఏంటి?

నటీనటులు:
కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో అందంగా కనిపించాడు. నటుడిగా కూడా రాణించాడు. సెంటిమెంటల్ సీన్స్ లో కళ్యాణ్ రామ్ నటన మెచ్చుకోతగిందే. అటు తనికెళ్ళ భరణితో ఎమోషనల్ సీన్స్, ఇటు శరత్ బాబు, సుహాసినితో సీన్స్ లో కూడా కళ్యాణ్ రామ్ కనబర్చిన పరిణితి బాగుంది. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కామెడీ రిలీఫ్ కలిగించాడు. అయితే తన పాత్ర కూడా కాసేపే నవ్విస్తుంది. తర్వాత వ్యవహారం రొటీనే. రాజీవ్ కనకాలది రెగ్యులర్ విలనిజం. సుహాసిని, శరత్ బాబు వంటి నటుల టాలెంట్ ను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు దర్శకుడు.

సాంకేతిక నిపుణులు:

సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. విలేజ్ వాతావరణాన్ని చక్కగా ప్రతిబింబించారు. ఇక్కడ ఆర్ట్ డైరెక్టర్ వర్క్ గురించి కూడా ప్రస్తావించుకోవాలి. గోపి సుందర్ ఆకట్టుకునే పాటలు ఇవ్వడంలో విఫలమయ్యాడు. ఒక్క పాట బాగుందనుకునే స్థాయిలో లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సాధారణంగా ఉంది. నిర్మాణ విలువలు మాత్రం టాప్ స్థాయిలో ఉన్నాయి. ఖర్చుకు వెరవకుండా ఈ సినిమాను తీసినట్లు అర్ధమవుతుంది.

దర్శకుడిగా సతీష్ వేగేశ్న పూర్తిగా విఫలమయ్యాడు. శతమానం భవతి వంటి సినిమా తీసిన దర్శకుడేనా అనిపిస్తుంది చాలా చోట్ల. కాన్సెప్ట్ బాగానే ఉన్నా దాన్ని ప్రేక్షకుల్లో రిజిస్టర్ అయ్యేలా చేయడంలో విఫలమయ్యాడు దర్శకుడు. చాలా సీన్స్ రిపిటీటివ్ గా అనిపించడం మరో పెద్ద మైనస్ పాయింట్. మొత్తంగా సతీష్ వేగేశ్న ఈ సినిమాలో అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యాడు.

విశ్లేషణ:
ఎంత మంచివాడవురా నేటి కుటుంబ బంధాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి చర్చిస్తుంది. వినడానికి లైన్ గా బాగానే ఉన్నా దర్శకుడు జనరంజకంగా తీయడంలో విఫలమయ్యాడు. రైటింగ్ స్టేజ్ లో తేలిపోయిన ఈ సినిమా తెరపై కూడా అంతే పేలవంగా తేలిపోయింది. ఎపిసోడ్స్, ఎపిసోడ్స్ గా వచ్చిపడిపోయే సెంటిమెంటల్ సీన్స్, సీరియల్స్ చాలా బెటర్ అనిపించే స్థాయిలో ఉన్నాయి. క్లైమాక్స్ కూడా రొటీన్ గానే ముగుస్తుంది. మొత్తంగా ఎంత మంచివాడవురా పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రచారమైనా జనాలకు నచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరి సంక్రాంతి అడ్వాంటేజ్ ఈ చిత్రాన్ని ఎంత వరకూ కాపాడుతుందో చూడాలి.

రేటింగ్: 2.5/5

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All