Homeన్యూస్`ఎందుకో ఏమో` మూవీ రివ్యూ!!

`ఎందుకో ఏమో` మూవీ రివ్యూ!!

enduko emo reviewఎందుకో ఏమో మూవీ రివ్యూ!!
న‌టీన‌టులుః నందు, నోయ‌ల్, పున‌ర్న‌వి భూపాలం,
సంగీతంఃప్రవీణ్‌,
కెమెరాఃజియస్‌ రాజ్‌,
ఎడిటింగ్‌ః మధు,
ఆర్ట్‌ః వర్మ,
ఫైట్స్‌ః డ్రాగన్‌ ప్రకాష్‌,
నిర్మాతః మాలతి వద్దినేని,
కథ-స్క్రీన్‌ ప్లే-దర్శకత్వంఃకోటి వద్దినేని.
రిలీజ్ డేట్ : 12 సెప్టెంబర్ 2018
రేటింగ్ : 3/5

మహేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నందు,నోయల్‌, పునర్నవి భూపాలం హీరో హీరోయిన్లుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మిస్తోన్న చిత్రం ‘ఎందుకో ఏమో’. టీజర్‌, సాంగ్స్ , ట్రైల‌ర్ తో యూత్ లో మంచి క్రేజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం విడుద‌లైంది. ఈ చిత్రం ప్రేక్ష‌కులనే ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం….

- Advertisement -

స్టోరీలోకి వెళితే…
హీరో నందు ఉంటున్న ఓ అపార్ట్ మెంట్ లోకి హీరోయిన్ పునర్న‌వి భూపాలం కూడా అద్దెకు దిగుతుంది. నందు ప‌ని చేసే సాఫ్ట్ వేర్ కంపెనీలో నే త‌ను కూడా జాబ్ జాయిన్ అవుతుంది. ఈ క్ర‌మంలో నందు, పునర్న‌వి కి ప‌రిచ‌యం అవుతుంది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారుతుంది. ఈ క్ర‌మంలో హీరో యిన్ పున‌ర్న‌వి కొన్ని ఫొటోస్ ప‌ట్టుకుని సిటీ అంతా ఆ ఫోటోలో ఉన్న వ్య‌క్తి కోసం సెర్చ్ చేస్తుంది. ఇలాంటి క్ర‌మంలో ప్రిన్స్ (నోయ‌ల్‌) అనే కుర్రాడు పునర్న‌వి ని చూసి మోజుప‌డ‌తాడు. త‌న ఫ్రెండ్ నందు ల‌వర్ అని తెలుసుకున్న త‌ను అమ్మాయిల‌తో ప్రేమ గీమ పెట్టుకోవ‌ద్దు అంటాడు. దీనికి నందు నా ల‌వ‌ర్ అలాంటి ది కాదు అంటాడు. అమ్మాయిలు అంతా అలాగే ఉంటారంటాడు.ఇలా నందు ల‌వ‌ర్ ని, నోయ‌ల్ ల‌వ‌లో దించుతా చూడంటా పందెం కాస్తాడు. మ‌రి ఆ పందెంలో ఎవ‌రు గెలిచారు? హీరోయిన్ ఎవ‌రి గురించి వెతుకుతోంది. హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అన్న‌ది మిగ‌తా క‌థాంశం.

 

సినిమాకు బ‌లంః
ద‌ర్శ‌క‌త్వం
క‌థ‌, క‌థ‌నాలు
సంగీతం.
సినిమాటోగ్ర‌ఫీ
సెకండాఫ్‌

మైన‌స్ పాయింట్స్ః

ఎడిటింగ్
హీరోయిన్
ఫ‌స్టాప్ లో లెంగ్తీ సీన్స్

ద‌ర్శ‌కుడికిది తొలి సినిమా అయినా…ఎంతో అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడిలా సినిమాను తెర‌కెక్కించాడు. ముఖ్యంగా ఇంట్ర‌వెల్ సీన్ ఇంట్ర‌స్టింగ్ గా వేసి సెకండాఫ్ లో క్యూరియాసిటీ పెరిగేలా చేశాడు. అనుకున్న క‌థ‌ను తెర కెక్కించ‌డంలో ఎక్క‌డా త‌డ‌బ‌డ‌లేదు. ఆర్టిస్టుల నుంచి మంచి న‌ట‌న రాబ‌ట్టుకున్నాడు. నిర్మాత కూడా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించారు. పాట‌లు బావున్నాయి. నేప‌థ్య సంగీతం కూడా స‌న్నివేశాల‌ను ఎలివేట్ చేసే విధంగా ఉంది. పాత పాట‌లు ఎక్క‌డా చెడ‌గొట్ట‌కుండా రీమిక్స్ చేశారు. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచె షార్ప్ గా ఉంటే బావుండేది. సుడిగాలి సుధీర్ క్యార‌క్ట‌ర్ కొన్ని చోట్ల ఇబ్బంది పెట్టినా కొన్ని చోట్ల బాగా నవ్వించింది. మాస్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది. అలాగే భద్ర‌మ్ కూడా అక్క‌డా అక్క‌డా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు.

నందు ఎప్ప‌టి లాగే త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. హీరోయిన్ గా పున‌ర్న‌విని ఊహించ‌కోలేం. సైడ్ క్యార‌క్ట‌ర్స్ మాత్ర‌మే ఆమె సూట‌వుతుంది. ఇక నోయ‌ల్ నెగిటివ్ పాత్ర‌లో నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. ప్లే బాయ్ గా, అమ్మాయిల‌ను ట్రాప్ చేసే పాత్ర‌లో నోయ‌ల్ చాలా బాగా ఆక‌ట్టుకున్నాడు.

సోష‌ల్ నెట్ వ‌ర్క్స్ ద్వారా అమ్మాయిల‌ను అబ్బాయిలు ఎలా ట్రాప్ చేస్తున్నారు. వారిని ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అనేది అంశానికి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడిస్తూ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియ‌న్స్ కి కూడా సినిమా న‌చ్చేలా ఉంటుంది. రెండు గంట‌లు ఎక్క‌డా బోర్ లేకుండా హాయిగా ఎంట‌ర్ టైన్ అవ్వాలంటే `ఎందుకో ఏమో` చూడొచ్చు.

సూటిగా చెప్పాలంటేః మెసేజ్ విత్ ఎంటర్ టైన్ మెంట్

https://www.youtube.com/watch?v=pbPMFq1Augw

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All