Homeటాప్ స్టోరీస్ఆ హీరోయిన్ ఎన్నికల్లో గెలుస్తుందా ?

ఆ హీరోయిన్ ఎన్నికల్లో గెలుస్తుందా ?

Eerojullo heroine Reshma contest from vyra ఈరోజుల్లో చిత్రంలో నటించిన రేష్మ తాజాగా తెలంగాణ ఎన్నికల బరిలో దిగింది . ఈరోజుల్లో సక్సెస్ తర్వాత పలు చిత్రాల్లో నటించింది కానీ అవేవి ఈరోజుల్లో మాదిరిగా హిట్ అవ్వలేదు దాంతో ఈ భామ రేసులో లేకుండాపోయింది . అయితే చిన్నప్పటి నుండి రాజకీయాల పట్ల , సమాజసేవ పట్ల ఆకర్షితురాలు కావడంతో తాజాగా భారతీయ జనతా పార్టీ తరుపున ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తోంది . అయితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అంతగా గుర్తింపు లేదు దాంతో రేష్మ విజయం సాధిస్తుందా ? అంటే డౌటే అని అంటున్నాయి రాజకీయ వర్గాలు .

టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తన ప్రాంత ప్రజలకు సేవ చేయాలనీ నడుం బిగించింది . కేసీఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతోంది రేష్మ . ఒక్క మహిళని కూడా తన క్యాబినెట్ లో చేర్చుకోకుండా మహిళలను ఘోరంగా అవమానించాడని , అలాగే కేంద్ర ప్రభుత్వం 5 లక్షల ఆరోగ్య పథకం పెడితే అది తెలంగాణ ప్రజలకు అందకుండా చేస్తోంది కేసీఆర్ అంటూ విమర్శలు చేస్తోంది . తమ జాతి కోసం పోరాటం చేస్తున్న రేష్మ విజయం సాధిస్తుందో ? లేదో ? డిసెంబర్ 11 న తేలిపోనుంది .

- Advertisement -

English Title: Eerojullo heroine Reshma contest from vyra

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All