Homeటాప్ స్టోరీస్రేవంత్ రెడ్డిపై పగతీర్చుకుంటున్న కేసీఆర్

రేవంత్ రెడ్డిపై పగతీర్చుకుంటున్న కేసీఆర్

ED rides on revanth reddyనాపై ఐటీ దాడులు చేయడం ఖాయమని , మరో రెండు మూడు రోజుల్లోనే జరుగుతాయని రేవంత్ రెడ్డి ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . అయితే రేవంత్ చెప్పినట్లుగానే ఈరోజు ఉదయం రేవంత్ రెడ్డి ఇంటితో పాటుగా మొత్తం 15 చోట్ల కేంద్రప్రభుత్వ ఈడీ అధికారులతో పాటుగా రాష్ట్ర అధికారులు పెద్దఎత్తున రైడ్ చేసారు . హైదరాబాద్ లో ఉన్న రేవంత్ ఇంటితో పాటుగా అతడి సోదరుడు మరో బంధువు అలాగే కొడంగల్ లలో మొత్తం మీద 15 చోట్ల ఏకకాలంలో ఐటీ దాడులు నిర్వహించారు . దీంతో రేవంత్ చెప్పినట్లుగానే కేసీఆర్ ప్రభుత్వం పగతీర్చుకుంటోందన్న విషయం బట్టబయలైంది . అయితే కేంద్ర , రాష్ట్ర అధికారులు మాత్రం ఆదాయ లెక్కలను తేల్చడానికే అని అంటున్నారు .

రేవంత్ ఇంట్లో లేని సమయంలో దాడులు నిర్వహించడం దారుణమని , అయినా ఎన్ని దాడులు చేసినా , ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని మేమంతా రేవంత్ కు అండగా ఉంటామని పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటుగా తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ సంఘీభావం ప్రకటించారు . కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 300 కోట్ల రూపాయలను రేవంత్ తెరవెనుక సమకూర్చినట్లు భావిస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే కేంద్ర ప్రభుత్వ పెద్దలు . ఇక కేసీఆర్ కూడా రేవంత్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాడు . ఓటుకి నోటు కేసులో కూడా రేవంత్ అడ్డంగా బుక్కైన నేపథ్యంలో ఆ కేసుకి సంబందించిన విషయాలు కూడా లాగడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది . మొత్తానికి రేవంత్ పట్ల కఠినంగా వ్యవహరిస్తుండటంతో అది రాజకీయంగా లాభించేలా ఉంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు .

- Advertisement -

English Title: ED rides on revanth reddy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All