
డివివి దానయ్య ప్రస్తుతం ఈయన పేరు మారుమోగిపోతుంది. దీనికి కారణం ఆర్ఆర్ఆర్. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దానయ్య దాదాపు రూ.500 కోట్లకు పైగా ఖర్చు తో నిర్మించారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి వారంలోనే వెయ్యి కోట్లు రాబట్టడం ఖాయమని అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ మూవీని పక్కన పెడితే దానయ్య త్వరలో చిరంజీవి , ప్రభాస్ లతో భారీ చిత్రాలు నిర్మించబోతున్నారు. అలాగే తన తనయుడు కళ్యాణ్ ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో కళ్యాణ్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్నాడు. ఇక ఈ మూవీ కి ‘అధిరా’ అనే పవర్ టైటిల్ ను అనుకుంటున్నట్లు సమాచారం. అధిరా అంటే మెరుపు అని అర్ధం. ప్రస్తుతం తేజా సజ్జాతో హనుమాన్ అనే సూపర్ హీరో సినిమా తెరకెక్కిస్తున్న ప్రశాంత్ వర్మ.. తదుపరిగా చేయబోయేది కళ్యాణ్ ఎంట్రీ మూవీనే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియజేయనున్నారట.