Homeటాప్ స్టోరీస్రిస్కీ షాట్స్ చేస్తున్న డాక్టర్ రాజశేఖర్

రిస్కీ షాట్స్ చేస్తున్న డాక్టర్ రాజశేఖర్

Dr rajasekhar risky fights for fansసీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ గరుడ వేగ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే . దాంతో వరుస ప్లాప్ లతో రేసులో వెనుకబడి ఉన్న రాజశేఖర్ కు సరికొత్త ఊపు ని ఉత్సాహాన్ని అందించినట్లయింది . గరుడ వేగ ఇచ్చిన ఉత్సాహంతో తాజాగా రాజశేఖర్ చేస్తున్న చిత్రం ” కల్కి ”. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుపుకుంటోంది . కాగా ఈ సినిమా కోసం రాజశేఖర్ యాక్షన్ దృశ్యాల్లో రిస్క్ తీసుకొని మరీ చేస్తున్నాడట .
రాజశేఖర్ సరసన ముగ్గురు అందమైన భామలు నటిస్తున్న ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్ డిఫరెంట్ క్యారెక్టర్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది .

సీనియర్ హీరో అయినప్పటికీ యాక్షన్ దృశ్యాలో రిస్క్ తీసుకొని నటించడం విశేషమే మరి . ఈ ఏజ్ లో రిస్కీ షాట్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు రాజశేఖర్ కు , కానీ అభిమానులను సంతోష పరచడానికి ఇంతటి రిస్క్ తీసుకుంటున్నాడు . హీరోగా అగ్ర స్థానాన్ని అలంకరించిన రాజశేఖర్ కు గత పదేళ్లుగా గడ్డుకాలం నడుస్తోంది దాంతో హిట్ కోసం గరుడ వేగ చేయగా అది ఇచ్చిన సక్సెస్ తో ఇలా రిస్క్ కి సై అంటున్నాడు .

- Advertisement -

English Title: Dr rajasekhar risky fights for fans

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All