Homeటాప్ స్టోరీస్డా. రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజున కొత్త చిత్రం షురూ!

డా. రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజున కొత్త చిత్రం షురూ!

డా. రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజున కొత్త చిత్రం షురూ!
డా. రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజున కొత్త చిత్రం షురూ!

యాంగ్రీ యంగ్‌మెన్ డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టించిన చిత్రం `క‌ల్కీ` మంచి విజ‌యాన్నిసాధించింది. దీంతో హీరో రాజ‌శేఖ‌ర్ మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చారు. ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డ కోలుకున్న ఆయ‌న కొంత విరామం త‌రువాత కొత్త చిత్రాన్ని మొద‌లుపెట్టారు. నేడు రాజ‌శేఖ‌ర్‌ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్ర టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ తో పాటు టైటిల్ టీజ‌ర్ మోష‌న్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం గురువారం విడుద‌ల చేసింది.

ఈ చిత్రానికి `శేఖ‌ర్‌` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. ఏజ్డ్ పాత్ర‌లో రాజ‌శేఖ‌ర్ మాసిన గ‌డ్డంతో క‌నిపిస్తున్న ఫ‌స్ట్ లుక్ షాకింగ్‌గా వుంది. `ది మెన్ విత్ స్కేర్‌` అని ట్యాగ్ లైన్‌ని పెట్టారు. ఈ చిత్రం ద్వారా ల‌లిత్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌, పెగాసుస్ సినీ కార్ప్ ఎల్ ఎల్ పీ బ్యాన‌ర్స్‌పై ఎం.ఎల్‌.వి. స‌త్య‌నారాయ‌ణ, శివాని, శివాత్మిక‌, వెంక‌ట శ్రీ‌నివాస్ బొగ్గ‌రం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్న 91వ చిత్ర‌మిది. గురువారం రాజ‌శేఖ‌ర్ పుట్టిన రోజు సంద‌ర్భ‌గా ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

- Advertisement -

అనూప్ రుబెన్స్ సంగీతం, ల‌క్ష్మీ భూపాల ర‌చ‌న‌, మ‌ల్లిఖార్జున్ నార‌గాని కెమెరా, ఆర్ట్ ద‌త్తాత్రేయ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా త‌ను క‌రోనా కార‌ణంగా మృత్యు అంచుల్లోకి వెళ్లాన‌ని, మీ ప్రేమ అభిమానాలే మ‌ళ్లీ త‌న‌ని సాధార‌ణ స్థితికి వ‌చ్చేలా చేశాయ‌ని, క‌నిపించ‌ని దేవుడికి, క‌నిపించే అభిమాన దేవుళ్ల‌కి స‌దా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటూ మీకు రుణ‌ప‌డి వుంటానన్నారు రాజ‌శేఖ‌ర్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All