Homeటాప్ స్టోరీస్భారీ ప్రమాదం నుండి బయటపడిన డాక్టర్ రాజశేఖర్

భారీ ప్రమాదం నుండి బయటపడిన డాక్టర్ రాజశేఖర్

Dr. Rajasekhar Great escape from huge accidentషూటింగ్ నిమిత్తం కులుమనాలి వెళ్లిన నేను , నా కుటుంబం క్షేమంగా ఉన్నామని , నాకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపాడు సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ . కల్కి షూటింగ్ నిమిత్తం కులుమనాలి వెళ్ళాడు హీరో డాక్టర్ రాజశేఖర్ అయితే కులుమనాలి వెళ్తున్న సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి . దాంతో రాజశేఖర్ కు గాయాలు అయ్యాయని వార్తలు వచ్చాయి , అవి మరింతగా స్ప్రెడ్ కాకముందే స్పందిస్తే మంచిదని భావించిన రాజశేఖర్ తనకు కానీ , నా కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి గాయాలు కాలేదని …… మా యోగ క్షేమాల కోసం ఫోన్ లు చేసి , మెసేజ్ లు పెట్టిన వాళ్లందరికీ కృతఙ్ఞతలు అంటూ తెలిపాడు రాజశేఖర్ .

కులుమనాలి వెళ్తున్న సమయంలో కొండచరియలు వవిరిగిపడ్డాయి , అయితే మాకు ఎలాంటి గాయాలు కాలేదని కాకపోతే ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది పడ్డామని అంటున్నాడు రాజశేఖర్ . తాజాగా ఈ హీరో కల్కి చిత్రంలో నటిస్తున్నాడు . ఇటీవలే యాక్షన్ దృశ్యాల్లో పాల్గొన్న సమయంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు రాజశేఖర్ . గరుడవేగ సూపర్ హిట్ కావడంతో మళ్ళీ హిట్ కోసం కష్టపడుతున్నాడు రాజశేఖర్ .

- Advertisement -

English Title: Dr. Rajasekhar Great escape from huge accident

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All