Homeటాప్ స్టోరీస్ఓవర్సీస్ లో డీజే టిల్లు సౌండ్ హాఫ్ మిలియన్ క్రాస్ చేసింది

ఓవర్సీస్ లో డీజే టిల్లు సౌండ్ హాఫ్ మిలియన్ క్రాస్ చేసింది

ఓవర్సీస్ లో డీజే టిల్లు సౌండ్ హాఫ్ మిలియన్ క్రాస్ చేసింది
ఓవర్సీస్ లో డీజే టిల్లు సౌండ్ హాఫ్ మిలియన్ క్రాస్ చేసింది

డీజే టిల్లు విడుదలై వారం దాటి పోయిన బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం డీజే కలెక్షన్ల సౌండ్ ఏమాత్రం తగ్గడం లేదు. గుంటూరు టాకీస్, కల్కి, కృష్ణ అండ్ హిస్ లీల లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు సిద్ధూ జొన్నలగడ్డ. ఈయన సినిమాలకు కథలు ఈయనే రాసుకుంటుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. కానీ ఆ మూడు సినిమాల కంటే పెద్ద విజయం సాదించింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా డీజే టిల్లు సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కంబైన్డ్ గా నిర్మించారు. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ అయ్యింది.

మొదటి రోజు మొదటి ఆట తోనే సూపర్ హిట్ సాధించిన ఈ మూవీ..రెండో రోజు నుండి హౌస్ ఫుల్ కలెక్షన్లతో రాణిస్తుంది. మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ మొదటి వారంలో భారీ వసూళ్లు రాబట్టి , రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ క్రాస్ చేసి వన్ మిలియన్ వైపు పరుగులు పెడుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది రోజుల్లో రూ. 12.16 కోట్ల నెట్, 21.22 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ఆదివారం మరోసారి బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో డే వైజ్ గా కలెక్షన్లు చూస్తే..
మొదటి రోజు: 3.18 కోట్లు
రెండో రోజు : 2.62 కోట్లు
మూడో రోజు : 1.40 కోట్లు
నాల్గో రోజు : 1.09 కోట్లు
ఐదో రోజు : 95 లక్షలు
ఆరో రోజు : 81 లక్షలు
ఏడో రోజు : 72 లక్షలు
ఎనిమిదో రోజు : 60 లక్షలు
తొమ్మిదో రోజు : 79 లక్షలు సాధించింది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All