
మాస్ మహారాజ రవితేజ కెరీర్ ఇప్పుడు ఏమాత్రం బాలేదు. తన రీసెంట్ చిత్రాలు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా విఫలమవడంతో రవితేజ ప్రస్తుతం తన ఆశలన్నీ ప్రస్తుతం చేస్తోన్న డిస్కో రాజా సినిమాపైనే పెట్టుకున్నాడు. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సరికొత్త కాన్సెప్ట్ తో ఉంటుందని అంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. వారం రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలు, ఒక పాట చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిస్కో రాజా డిసెంబర్ 20న విడుదలకు ముస్తాబవుతోంది.
- Advertisement -