Homeటాప్ స్టోరీస్వినాయక చవితి కానుకగా రేపే డిస్కోరాజా ఫస్ట్ లుక్

వినాయక చవితి కానుకగా రేపే డిస్కోరాజా ఫస్ట్ లుక్

disco raja
disco raja

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం డిస్కోరాజా. యస్.ఆర్. టి. ఎంటర్టైన్మెంట్ పతాకంపై వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ బ్యానర్లో “నేల టికెట్” చిత్రం తర్వాత రవితేజ చేస్తున్న చిత్రమిది. పాయల్ రాజ్ పుత్, నాభ నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వి ఐ ఆనంద్ విభిన్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో వుంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయన.

- Advertisement -

క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కానీ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి. వీరి కలయికలో వస్తోన్న డిస్కోరాజా గ్యారెంటీగా సూపర్ హిట్ ఫిలిం అవుతోందని చిత్ర యూనిట్లో టాక్ విన్పిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని వినాయక చవితి సందర్బంగా సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్. ఇక చిత్రం తాజా షెడ్యూల్ యూరప్ లో జరగనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు..!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All