Homeటాప్ స్టోరీస్మరో బాహుబలి అన్నారు డిజాస్టర్ అయ్యింది

మరో బాహుబలి అన్నారు డిజాస్టర్ అయ్యింది

Disaster talk to Mohanlal's Odiyanమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ” ఒడియన్ ” చిత్రం నిన్న విడుదల అయ్యింది , డిజాస్టర్ అయ్యింది కూడా . అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఇది మరో బాహుబలి సినిమా అంటూ ప్రచారం చేసారు . ట్రైలర్ చూసి నిజమే అనుకున్నారు ఎందుకంటే ….. ట్రైలర్ బాగుండటంతో తప్పకుండా విభిన్నమైన సినిమా అని అనుకున్నారు దానికి తోడు మలయాళంలో స్టార్ హీరో మోహన్ లాల్ దాంతో భారీ అంచనాలు నెలకొన్నాయి . కట్ చేస్తే నిన్న విడుదల అయ్యింది సినిమా ఘోరంగా ఉండటంతో షాక్ అయ్యారు ప్రేక్షకులు .

భారీ అంచనాలు పెట్టుకొని వచ్చిన అభిమానులు సినిమా చూసి షాక్ అయి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు . సోషల్ మీడియాలో అయితే ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు . బాహుబలి సినిమాని తలదన్నే సినిమా అని అన్నారు డిజాస్టర్ అయ్యిందిరా నాయనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . మళయాళంలోనే కాకుండా టాలీవుడ్ లో భారీ ఎత్తున విడుదల చేసారు ఈ సినిమాని . మన్యం పులి హిట్ అయ్యింది , అలాగే జనతా గ్యారేజ్ చిత్రాల్లో మోహన్ లాల్ నటించడం వల్ల ఈ సినిమా ఆడుతుందని అనుకున్నారు కానీ ఇక్కడ ఒడియన్ సినిమాని పట్టించుకున్న వాళ్లే లేరు .

- Advertisement -

English Title: Disaster talk to Mohanlal’s Odiyan

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All