Homeటాప్ స్టోరీస్పెళ్లిపీట‌లెక్కిన యంగ్ డైరెక్ట‌ర్!

పెళ్లిపీట‌లెక్కిన యంగ్ డైరెక్ట‌ర్!

పెళ్లిపీట‌లెక్కిన యంగ్ డైరెక్ట‌ర్!
పెళ్లిపీట‌లెక్కిన యంగ్ డైరెక్ట‌ర్!

టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తోంది. మునుపెన్న‌డూ లేనంత‌గా స్టార్ హీరోలు, హీరోయిన్‌లు, యంగ్ డైరెక్ట‌ర్స్ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దిల్ రాజు నుంచి మొద‌లైన ఈ పెళ్లిళ్ల హంగామా ఇప్ప‌టికీ అలాగే కొన‌సాగుతోంది. ఇటీవ‌ల మెగా డాట‌ర్ నిహారిక వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఓ యంగ్ డైరెక్ట‌ర్ వివాహం చేసుకున్నారు.

మెంట‌ల్ మ‌దిలో, బ్రోచేవారెవ‌రురా వంటి చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న వివేక్ ఆత్రేయ గురువారం వివాహం చేసుకున్నారు. శ్రీ‌జా గౌనీ అనే యువ‌తిని పెళ్లి చేసుకున్నారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ వివాహానికి అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. వివేక్ ఆత్రేయ‌తో రెండు చిత్రాలు చేసిన హీరో శ్రీ‌విష్ణు హాజ‌ర‌య్యారు.

- Advertisement -

హీరోయిన్ నివేదా థామ‌స్ కూడా ఈ వేడుక‌లో పాలు పంచుకుంది. నూత‌న దంప‌తుల‌కు శ్రీ‌విష్ణు, నివేదా థామ‌స్ శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. ప్ర‌స్తుతం వివేక్ ఆత్రేయ నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా `అంటే సుంద‌రానికి` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప్రారంభానికి ముందే ఈ మూవీ రికార్డులు సృష్టిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All