Homeటాప్ స్టోరీస్హగ్ ఇస్తుంటే షాక్ అయ్యాడట

హగ్ ఇస్తుంటే షాక్ అయ్యాడట

Director shocked while amala paul giving hugఎవరైనా హీరోయిన్ హగ్ ఇస్తుంటే ఎగిరి గంతేసి మరీ ఆ హగ్ తీసుకుంటారు కానీ ఓ యువ దర్శకుడు మాత్రం ఓ హీరోయిన్ హగ్ ఇస్తుంటే షాక్ అయ్యాడట ! సంచలనం కలిగించే ఈ విషయాన్నీ హీరోయిన్ అమలా పాల్ వెల్లడించడం విశేషం . ఇంతకీ హగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన హీరోయిన్ ఎవరయ్యా అంటే ఇంకెవరు హాట్ భామ అమలా పాల్ కాగా ఆ యువ దర్శకుడు రామ్ కుమార్ . తాజాగా తమిళంలో రామ్ కుమార్ దర్శకత్వంలో అమలా పాల్ నటించిన రాక్షసన్ చిత్రం విడుదలై విజయవంతంగా నడుస్తోంది . దాంతో ఆ చిత్ర సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు . కాగా విజయోత్సవ వేడుకలో పాల్గొన్న అమలా పాల్ ఈ విషయాన్నీ చెప్పింది .

షూటింగ్ మొత్తం పూర్తీ కావడంతో హమ్మయ్య ! అనుకోని దర్శకుడు రామ్ కుమార్ కు హగ్ ఇవ్వబోయిందట అమలా పాల్ అయితే అమలా పాల్ దగ్గరకు రావడమే ఆలస్యం చటుక్కున పక్కకు తప్పుకున్నాడట షాక్ తో . దాంతో ఎందుకు షాక్ అవుతున్నావ్ ! మన సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసాం కాబట్టి హగ్ ఇస్తున్నాను అంటూ అతడిని బుజ్జగించి మరీ హగ్ ఇచ్చిందట . ఈ యువ దర్శకుడు హగ్ కోసం ఎందుకు వెంపర్లాడలేదంటే ……. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మీ టూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే . దాంతో లేని పోనీ వివాదాలు ఎందుకు అంటూ అమలా పాల్ ఇచ్చే హగ్ కు కక్కుర్తి పడలేదట ! అయితే అలా చేయడం వల్ల మంచి హగ్ పొందాడు లెండి .

- Advertisement -

English Title: Director shocked while amala paul giving hug

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All