Homeటాప్ స్టోరీస్చెత్త సినిమాలు తీసే వర్మ కొత్త కంపెనీ పెట్టాడు

చెత్త సినిమాలు తీసే వర్మ కొత్త కంపెనీ పెట్టాడు

director ram gopal varma is back with d company web seriesశివ చిత్రంతో ప్రభంజనం సృష్టించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ . శివ చిత్రంతో మూసలో వెళుతున్న తెలుగు సినిమాలకు సరికొత్త ట్రెండ్ ని చూపించిన దర్శకుడు కానీ ఏమైంది ఆ సినిమా తర్వాత కొన్ని మంచి హిట్స్ ఇచ్చినప్పటికీ గతకొంత కాలంగా పరమచెత్త సినిమాలు చేస్తూ చెత్త రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు రాంగోపాల్ వర్మ . ఇటీవలే కింగ్ నాగార్జున తో ఆఫీసర్ అనే మరో చెత్త సినిమాని ప్రేక్షకుల మీదకు వదిలి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిన వర్మ తాజాగా ” డి కంపెనీ ” అనే కొత్త కంపెనీ పెట్టాడట ! ఈ కంపెనీ పై వెబ్ సిరీస్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడు .

ఇప్పటికే వర్మ తీసిన చెత్త సినిమాలతో తనపై ఉన్న అభిమానాన్ని పోగొట్టుకున్నాడు . మరి ఈ వెబ్ సిరీస్ తో తన ఇమేజ్ ని పెంచుకుంటాడా ? లేక షరా మామూలే అనిపించుకుంటాడా చూడాలి . కథ అయితే ముంబై మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం కథ . 1980 లో ముంబై ని వణికించింది మాఫియా . దాంతో వెబ్ సిరీస్ కు అయితే బాగానే ఉంటుంది కానీ తనదైన శైలిలో తీస్తాడా ? లేక చెత్త రికార్డ్ సొంతం అయ్యింది కాబట్టి దీన్ని కూడా ఆ చెత్త లో భాగంగా తెరకెక్కిస్తాడా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న . వర్మ కూడా చెత్త సినిమాల వర్మ అంటుంటే కనీసం కొంతైనా ఇబ్బంది పడిఉంటాడు కాబట్టి తనలో ఉన్న క్రియేటివిటీ ని బయట పెడితే మళ్ళీ శివ నాటి వర్మ ని చూడొచ్చు లేదంటే ……..

- Advertisement -

English Title:  director ram gopal varma is back with d company web series

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All