Homeటాప్ స్టోరీస్గీత గోవిందం డైరెక్టర్ కు ఇబ్బందులు

గీత గోవిందం డైరెక్టర్ కు ఇబ్బందులు

Director parashuram facing problems గీత గోవిందం చిత్రం భారీ విజయం దిశగా దూసుకుపోతుండటంతో ఆ చిత్ర దర్శకులు పరశురామ్ కు ఇబ్బందులు మొదలయ్యాయి . గీత గోవిందం చిత్రానికి ముందు శ్రీరస్తు శుభమస్తు చిత్రం చేసాడు అది కూడా మంచి హిట్టే ! అయితే గీత గోవిందం మాత్రం విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ తో భారీ హిట్ గా నిలిచేలా ఉంది దాంతో పరశురామ్ తో సినిమాలు చేయడానికి పలువురు హీరోలు , నిర్మాతలు క్యూ కడుతున్నారు . ఇప్పటికే పలువురు నిర్మాతలు పరశురామ్ కు అడ్వాన్స్ లు ఇచ్చారు కాగా వాళ్ళు ఇప్పుడు మాతో సినిమా చెయ్ అంటే మాతో సినిమా చెయ్ అంటూ ఇబ్బంది పెడుతున్నారట !

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అరడజను మంది నిర్మాతలు పరశురామ్ కి అడ్వాన్స్ లు ఇచ్చారట వాళ్లంతా కూడా మాతో అంటే మాతో అంటున్నారు ఇప్పుడు . ఇక గీతా ఆర్ట్స్ మాత్రం మాకు మూడు సినిమాల అగ్రిమెంట్ ఉంది అది పూర్తయ్యాకే బయటి సినిమాలు అంటూ భీష్మించుకు కూర్చున్నారట . ఇప్పటికి ఆ సంస్థ లో రెండు సినిమాలు చేసాడు పరశురామ్ ఇక ఇప్పుడు మూడోది వరుణ్ తేజ్ తో చేయాలనీ డిసైడ్ అయ్యారట ! పరశురామ్ బయటకి వెళ్లకుముందే వరుణ్ తేజ్ తో సినిమా చేసేస్తే అప్పుడు బయట ఏదైనా సినిమా చేసుకోవచ్చు అని కరాఖండి గా చెప్పారట ! వరుణ్ తేజ్ తో సినిమా చేస్తే మంచు విష్ణు లైన్ లో ఉండాల్సిందే . ఎందుకంటే మంచు విష్ణు ఇప్పుడే చేద్దామని అంటున్నాడట కానీ కుదరదు పరశురామ్ కున్న కమిట్ మెంట్స్ వల్ల . మొత్తానికి అందరి దగ్గర అడ్వాన్స్ లు తీసుకొని ఇబ్బంది పడుతున్నాడు పరశురామ్ .

- Advertisement -

English Title: Director parashuram facing problems

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All