Homeటాప్ స్టోరీస్ఫస్ట్ డే కలెక్షన్ల లో అదరగొట్టిన గీత గోవిందం

ఫస్ట్ డే కలెక్షన్ల లో అదరగొట్టిన గీత గోవిందం

geetha govindam first day world wide collectionsమొట్ట మొదటి రోజునే కలెక్షన్ల వర్షం కురిపించి అదరగొట్టారు గీత గోవిందం . ఫస్ట్ డే గీత గోవిందం కలెక్షన్లు ఎంత వచ్చాయో తెలుసా ……. 9 కోట్లకు పైగా షేర్ సాధించి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది . కేవలం 13 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన గీత గోవిందం వసూళ్లు అనూహ్యంగా మొదటి రోజునే 9 కోట్లకు పైగా ప్రపంచ వ్యాప్తంగా షేర్ సాధించడంతో ఆ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది . విజయ్ దేవరకొండ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది గీత గోవిందం చిత్రం .

విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటించిన గీత గోవిందం నిన్న విడుదలైన విషయం తెలిసిందే . ఫస్ట్ డే నే సూపర్ హిట్ టాక్ రావడంతో భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది . సరైన సినిమా ఏది బాక్సాఫీస్ వద్ద లేదు దానికి తోడు గీత గోవిందం యూత్ ని బాగా ఆకట్టుకునేలా రూపొందడంతో అవలీలగా 50 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని నమ్ముతున్నారు . పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించగా మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా 9. 66 కోట్ల షేర్ రావడంతో ఆ చిత్ర బృందం చాలా చాలా సంతషంగా ఉంది .

- Advertisement -

English Title: geetha govindam first day world wide collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All