Homeగాసిప్స్దిల్ రాజు గుప్పిట్లో సంక్రాంతి సినిమాలు

దిల్ రాజు గుప్పిట్లో సంక్రాంతి సినిమాలు

దిల్ రాజు గుప్పిట్లో సంక్రాంతి సినిమాలు
దిల్ రాజు గుప్పిట్లో సంక్రాంతి సినిమాలు

సినిమా తీయడం కాదు, రిలీజ్ చేయడం నేర్చుకోమని ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక టాక్ ఉంది. ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ కాకుండా ల్యాబ్ లలో మగ్గుతున్నాయి. రిలీజ్ చేసుకోవడానికి డబ్బులు లేక కొన్ని ఉంటే థియేటర్లు దొరక్క కొన్ని మగ్గుతున్నాయి. మరికొన్ని చిత్రాలైతే దొరికిన థియేటర్లలోనే రిలీజై ఎవరికీ తెలియక ఆడకుండా పోతున్నవి ఉన్నాయి. అందుకే థియేటర్ల మానేజ్మెంట్ ప్రతి ఫిల్మ్ మేకర్ కు తెలిసుండాలి. కనీసం థియేటర్లను మ్యానేజ్ చేసేవారితో సాన్నిహిత్యం ఉండాలి. ఇవేమీ కావనుకుంటే వారికి సినిమా నచ్చితే అమ్మేసైనా రిలీజ్ చేసుకోగలగాలి.

ఇవి చిన్న సినిమాకున్న కష్టాలు. మరి పెద్ద సినిమాలకు కూడా రిలీజ్ కష్టాలుంటాయి తెలుసా. వారానికి ఒక సినిమా విడుదలైతే పెద్ద ఫరక్ పడదుగాని సంక్రాంతి వంటి పండగ సమయాల్లో మూడు, నాలుగు సినిమాలు విడుదలవుతున్నప్పుడు కచ్చితంగా థియేటర్ మానేజ్మెంట్ అన్నది అవసరం. ఈ సంక్రాంతికి కూడా నాలుగు చిత్రాలు విడుదలవుతున్నాయి. అయితే ఇందులో మూడు చిత్రాలు ఒక చేతి మీదే విడుదలవుతుండడం ఆ వ్యక్తికున్న పవర్, పలుకుబడిని తెలియజేస్తుంది.

- Advertisement -

అల వైకుంఠపురములో చిత్రానికి నైజాం, ఉత్తరాంధ్ర కలిపి 30 కోట్ల బిజినెస్ జరిగింది. నైజాంలో 20 కోట్లకు ఉత్తరాంధ్ర 10 కోట్లకు ఈ చిత్రం అమ్ముడుపోయింది. ఈ రెండు ఏరియా హక్కులను టాప్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ఇదే రేటుకు ఇతర టాప్ డిస్ట్రిబ్యూటర్లు వచ్చినా కూడా దిల్ రాజుకే హక్కులు అమ్మాలని నిర్ణయించుకున్నారు. కారణం దిల్ రాజు చేతిలో ఉన్న థియేటర్లు. నైజాం, ఉత్తరాంధ్రలో దిల్ రాజుకు మంచి పట్టుంది. ఈ రెండు ఏరియాల్లోనూ సినిమాలను పంపిణీ చేసే దిల్ రాజు థియేటర్ మానేజ్మెంట్ లో ఆరితేరిపోయాడు.

పైగా ఈ సంక్రాంతికి విడుదలవుతున్న నాలుగు చిత్రాల్లో రెండింట్లో దిల్ రాజు భాగస్వామిగా ఉన్నాడు. రజినీకాంత్ దర్బార్ తెలుగు హక్కులు దిల్ రాజు వద్ద ఉన్నాయి. ఇక మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని దిల్ రాజు సమర్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలో దిల్ రాజుకే అల వైకుంఠపురములో హక్కులు ఇచ్చేస్తే బాగుంటుందని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. మరో పంపిణీదారుడికి ఇచ్చి థియేటర్ల విషయంలో పేచీ పెట్టుకునే కంటే దిల్ రాజు అయితే తమ సినిమాకు అన్యాయం జరగదని నైజాం, ఉత్తరాంధ్ర హక్కులు అతనికే కట్టబెట్టారు.

పెద్ద సినిమాల విషయంలో కూడా థియేటర్ మానేజ్మెంట్ ఇంత కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు ఇక చిన్న సినిమాల గురించి చెప్పేదేముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All