Homeటాప్ స్టోరీస్వి ఆఫర్ ను తోసిపుచ్చిన దిల్ రాజు

వి ఆఫర్ ను తోసిపుచ్చిన దిల్ రాజు

వి ఆఫర్ ను తోసిపుచ్చిన దిల్ రాజు
వి ఆఫర్ ను తోసిపుచ్చిన దిల్ రాజు

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఘోరాతిఘోరంగా ఉంది. అసలే నష్టాల్లో ఉండే ఇండస్ట్రీ.. ఆపై కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ లు లేక, థియేటర్లు మూతబడి సినిమా రిలీజ్ లు అన్నది లేదు. ఈ పరిస్థితి మరో నెల రోజులు ఉండే పరిస్థితి నెలకొంది. అయితే ఈ పరిస్థితిని డిజిటల్ మీడియా తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది. అందుకే సినిమాలు రెడీ అయిపోయి రిలీజ్ లు ఆగిపోయిన సినిమాలకు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ లు ఇచ్చేలా ప్లాన్ చేసింది.

నిర్మాతలకు భారీ రేట్లు ఆఫర్ చేసి సినిమాను డైరెక్ట్ గా తమ స్ట్రీమింగ్ సైట్ లో విడుదల చేసేలా అమెజాన్ ప్రైమ్ దిల్ రాజుకు 35 కోట్ల భారీ రేటును ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇది దాదాపుగా సినిమా బడ్జెట్ కు సమానం. డిజిటల్ రైట్స్ తోనే దాదాపు 90 శాతం వెనక్కి వచ్చేస్తే ఇక సాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ కలుపుకుని చాలా ఈజీగా దిల్ రాజు లాభాల బాట పట్టొచ్చు. సో ఈ వార్తల ప్రకారం నాని, సుధీర్ బాబు నటించిన వి సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు.

- Advertisement -

అయితే దిల్ రాజుకు ఈ ఆఫర్ ప్రాఫిట్స్ తెచ్చేదే అయినా కానీ ఒక సిస్టంకు మొత్తం నష్టం తెచ్చే ఈ పద్దతికి ఓకే చెప్పడం ఇష్టం లేక ఆ ఆఫర్ ను కాదన్నాడని సమాచారం. ప్రస్తుతం గురించి ఆలోచించి ఈ స్టెప్ తీసుకుంటే తర్వాత అది థియేట్రికల్ సిస్టంకే ముప్పు తెచ్చేదిగా పరిణమించవచ్చు.

అందుకే దిల్ రాజు అందరి శ్రేయస్సు కోరి దీనికి ఓకే చెప్పలేదని సమాచారం. వి సినిమా కాకుండా దిల్ రాజు పలు సినిమాలను కూడా ఈ ఏడాది ప్లాన్ చేసుకున్నాడు. వి సినిమాకు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడన్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All