
టాలీవుడ్‌లో పాన్ ఇండియా చిత్రాల పరంపర కొనసాగుతోంది. ఏ స్టార్ హీరో.. స్టార్ ప్రొడ్యూసర్.. స్టార్ డైరెక్టర్ నోట విన్నా ఓకటే మాట పాన్ ఇండియా మూవీ. `బాహుబలి` తరువాత ఈ తరహా చిత్రాల పరంపర టాలీవుడ్‌లో మరీ ఎక్కువైంది. ప్రస్తుతం సెట్స్‌పై అరడజను పాన్ ఇండియా చిత్రాలు వున్నాయి. ఈ జాబితాలో మరో సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నారు.
ఇప్పటికే శంకర్, రామ్‌చరణ్‌లతో ఓ భారీ ప్రాజెక్ట్‌ని ప్రకటించిన దిల్ రాజు ఈ మూవీతో పాటు మరో భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ ప్రశాంత్ నీల్‌తో వుంటుందన్నది నిజమే కానీ అందులో ప్రభాస్ మాత్రం నటించడం లేదట.
ఇందులో తమిళ స్టార్ హీరో, ఇళయదపతి విజయ్ నటించే అవకాశం వుందని తెలిసింది. `మాస్టర్` తరువాత విజయ్ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇది విజయ్ నటిస్తున్న 65వ చిత్రం. 66వ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్‌తో చేయబోతున్నారు. 67వ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించే అవకాశం వుందని చెబుతున్నారు.