Homeటాప్ స్టోరీస్ఆ సినిమాలు అన్నీ దిల్ రాజు చేతికే

ఆ సినిమాలు అన్నీ దిల్ రాజు చేతికే

ఆ సినిమాలు అన్నీ దిల్ రాజు చేతికే
ఆ సినిమాలు అన్నీ దిల్ రాజు చేతికే

దిల్ రాజు నిర్మాతగా అత్యంత విజయవంతమవ్వడానికి ప్రధాన కారణాల్లో ప్రముఖమైనది అతని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. నైజాం, వైజాగ్ ఏరియాల్లో దిల్ రాజు ద్వారా సినిమా విడుదలైందంటే మినిమం గ్యారంటీ రిలీజ్ ఉంటుందనేది ఒక స్థాయి నమ్మకం అందరిలోనూ ఉంది. ఆయన దగ్గర నమ్మకమైన బయ్యర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ఏరియాల్లో దిల్ రాజుకు మంచి పట్టు ఉంది. అందుకే వేరే బడా నిర్మాతలు సైతం దిల్ రాజుకే ఈ సినిమాలను ఆ రెండు ప్రాంతాలకూ కట్టబెడుతున్నారు.

డిసెంబర్ 25న దిల్ రాజు సొంత నిర్మాణంలో తెరకెక్కిన ఇద్దరి లోకం ఒకటే సినిమా విడుదలవుతోంది. దీన్ని ఆ రెండు ఏరియాల్లో ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. అలాగే జనవరి 10న దర్బార్, జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, జనవరి 12న అల వైకుంఠపురములో, జనవరి 15న ఎంత మంచివాడవురా చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాలు అన్నీ నైజాం, వైజాగ్ లలో దిల్ రాజే పంపిణీ చేసేది. ఎంత మంచివాడవురా ఒక్కటి మాత్రం వైజాగ్ లో చెయ్యట్లేదు. ఒక్క నైజాంకే పరిమితమయ్యాడు.

- Advertisement -

ఇప్పుడు తాజాగా కన్నడ నుండి వస్తోన్న మరో భారీ సినిమా అతడే శ్రీమన్నారాయణ జనవరి 1న విడుదల కాబోతోంది. ఈ సినిమాను కూడా దిల్ రాజు నైజాం, వైజాగ్ లలో పంపిణీ చేయబోతున్నాడు. టాక్ బాగుంటే 9 వరకూ అతడే శ్రీమన్నారాయణకు మంచి అవకాశం. ఇలా డిసెంబర్ 25 నుండి మొదలుపెట్టి దాదాపు అన్ని సినిమాల పంపిణీ హక్కులు దిల్ రాజు దగ్గర ఉండడం ఒక రకంగా ప్లస్ అనే చెప్పుకోవచ్చు. ఏ సినిమా అయినా ఒకటే కాబట్టి, టాక్ బాగుంటే థియేటర్ల సమస్య అనేదే ఉండదు.

అతడే శ్రీమన్నారాయణ హక్కులను సినిమా చూసాక నచ్చి దిల్ రాజు చేజిక్కుంచుకున్నాడు. దిల్ రాజుకు సినిమా నచ్చిందంటే అందులో విషయం ఉన్నట్లే అన్న భావనలో మిగతా డిస్ట్రిబ్యూటర్లు కూడా రంగంలోకి దిగారు. అదీ సంగతి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All