Homeగాసిప్స్పింక్ రీమేక్ కు అతి తక్కువ బడ్జెట్

పింక్ రీమేక్ కు అతి తక్కువ బడ్జెట్

పింక్ రీమేక్ కు అతి తక్కువ బడ్జెట్
పింక్ రీమేక్ కు అతి తక్కువ బడ్జెట్

అవును మీరు చదివింది నిజమే. దిల్ రాజు నిర్మిస్తోన్న పింక్ రీమేక్ కు అతి తక్కువ బడ్జెట్ ను కేటాయించాడు. కేవలం 20 కోట్లలో ఈ చిత్రాన్ని నిర్మించాలని భావిస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ను ఈ సినిమాకు ఒప్పించడానికి 50 కోట్ల రూపాయలకు డీల్ సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. పవన్ పారితోషికం కాకుండా ఈ సినిమాకు అయ్యే ఖర్చును 20 కోట్లలో ముగించాలని భావిస్తున్నాడు దిల్ రాజు. హీరోయిన్లుగా నివేతా థామస్. అంజలిలను తీసుకోవడానికి కారణం కూడా అదేనని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా దాదాపు 70 శాతం కోర్టులో, ఒక రిసార్ట్ లో నడుస్తుంది. మిగిలిన భాగం అమ్మాయిల అపార్ట్మెంట్ లో, పవన్ నివసించే హౌస్ లో ఉంటుంది. సో లొకేషన్స్ ను ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. కాస్ట్ అండ్ క్రూ కూడా భారీగా ఛార్జ్ చేసే వాళ్ళు లేరు. థమన్ సూపర్ ఫామ్ లో ఉన్నా కానీ తను తీసుకునేది చాలా తక్కువే. దర్శకుడు వేణు శ్రీరామ్ దిల్ రాజు దర్శకుడే కాబట్టి అతనికి మంత్లీ శాలరీ ఎప్పటినుండో పే చేస్తున్నారు. అదే ఈ చిత్రానికి కూడా కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రకంగా దిల్ రాజు 20 కోట్లలో సినిమాను ముగించాలని భావిస్తున్నాడు.

- Advertisement -

పింక్ రీమేక్ కు హైప్ తీసుకొచ్చి 100 కోట్లకు అమ్మాలన్నది దిల్ రాజు ప్లాన్. ఈ రకంగా పవన్ తో పనిచేయాలన్న తన కోరికా తీరుతుంది, నిర్మాతగా టేబుల్ ప్రాఫిట్స్ కూడా అందుకోవచ్చు. ప్లానింగ్ అయితే బానే ఉంది. కాకపోతే ఇది ఫక్తు కమర్షియల్ ఫార్మాట్ సినిమా కాదు. పాత పవన్ సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ తో దీన్ని పోల్చి చూడలేం. ఈ నేపథ్యంలో పింక్ రీమేక్ ఫలితంపై అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఉగాదికి సినిమాను మే 15న విడుదల చేయాలని భావిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All