Homeన్యూస్దిక్సూచి రివ్యూ

దిక్సూచి రివ్యూ

నటీనటులు : దిలీప్ కుమార్ , చాందిని ,
సంగీతం : పద్మనాబ్ భరద్వాజ్
నిర్మాతలు : శైలజ , నరసింహారాజు
దర్శకత్వం : దిలీప్ కుమార్ సాల్వాది
రేటింగ్ : 3/5
రిలీజ్ డేట్ : 26 ఏప్రిల్ 2019

- Advertisement -

దిలీప్ కుమార్ – చాందిని జంటగా రూపొందిన చిత్రం ” దిక్సూచి ”. నిన్న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

దిలీప్ ( దిలీప్ కుమార్ ) ఓ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేస్తుంటాడు . అయితే ట్రైన్ లో వెళ్తున్న సమయంలో ఓ అపరిచితుడు ఫోన్ చేసి నేను చెప్పిన పని చేయకపోతే నీ వాళ్ళని అంతం చేస్తానని హెచ్చరిస్తాడు దాంతో భయపడిపోయిన దిలీప్ ఆ ఆగంతకుడు చెప్పినట్లు చేస్తాడు . అయితే తనకు తెలియకుండానే తన అమ్మ – చెల్లిని కిడ్నాప్ చేస్తాడు దిలీప్ దాంతో వాళ్ళని కాపాడుకోవడానికి ఏం చేసాడు ? అసలు దిలీప్ కు ఫోన్ చేసి తన వాళ్ళని తన చేతే కిడ్నాప్ చేయించిన ఆ ఆగంతకుడు ఎవరు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

 

హైలెట్స్ :

దిలీప్ కుమార్
చాందిని
కథ
సంగీతం
విజువల్స్
నిర్మాణం

డ్రా బ్యాక్స్

సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు

నటీనటుల ప్రతిభ :

హీరో దిలీప్ కుమార్ ఈ చిత్రానికి వెన్నెముక గా నిలిచాడు . కొత్తవాడు అయినప్పటికీ అన్ని సన్నివేశాల్లో చాలా బాగా నటించాడు . అలాగే హీరోయిన్ చాందిని అందంగా ఉంది , అందంగా నటించింది . ఛత్రపతి శేఖర్ విలన్ గా మెప్పించాడు ,సమ్మెట గాంధీ రాజు పాత్రలో మెప్పించాడు . ఇక ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తమతమ పాత్రలో రాణించారు .

సాంకేతిక వర్గం :

విజువల్స్ బాగున్నాయి , నిర్మాతలు పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద చూపించారు . శైలజ – నరసింహ రాజు లు నిర్మాతలుగా మొదటి సినిమాతోనే తమ కార్యదక్షత ఎలా ఉంటుందో నిరూపించారు . పద్మనాభ భరద్వాజ్ అందించిన పాటలు బాగున్నాయి అలాగే నేపథ్య సంగీతంతో సినిమాని మరో మెట్టు పై నిలబెట్టాడు . ఇక దర్శకుడు దిలీప్ విషయానికి వస్తే ……. నటీనటుల నుండి తనకు రావాల్సిన నటనని రాబట్టుకున్నాడు . ఫస్టాఫ్ ని బాగా తెరకెక్కించాడు . అయితే సెకండాఫ్ లో కాస్త జాగ్రత్తలు తీసుకొంటే ఇంకా బాగుండేది . మొదటి సినిమాతోనే మంచి ప్రయత్నం చేసాడు దిలీప్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All