Homeటాప్ స్టోరీస్ఈ భామ పెళ్లి కూడా పెటాకులేనా ?

ఈ భామ పెళ్లి కూడా పెటాకులేనా ?

Differences between Satna Titus and her husbandబిచ్చగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ సాట్నా టైటస్ , కాగా ఈ భామ అమలా పాల్ రూట్లో వెళ్లనున్నట్లు తెలుస్తోంది . అమలా పాల్ రూట్ లో వెళ్లడం ఏంటి అని అనుకుంటున్నారా ? అమలా పాల్ దర్శకులు ఏ ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . అయితే వెంటనే విడాకులు కూడా తీసుకుంది దాంతో ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో నటిస్తోంది ఇంతకుముందు కంటే గ్లామర్ పాత్రలు పోషిస్తూ . ఇక సాట్నా టైటస్ కూడా ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కార్తీక్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . కట్ చేస్తే అతడితో విడాకులు తీసుకోవడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది .

పెద్దలు వద్దని చెప్పినప్పటికీ సాట్నా టైటస్ వినలేదు , ప్రేమలో ఉంది కాబట్టి పెద్దలను లెక్కచేయకుండా పెళ్లి చేసుకుంది . 2016 లో పెళ్లి చేసుకోగా అప్పుడే ఇద్దరి మధ్య గొడవలు ముదిరాయట . దాంతో కొద్దిరోజులుగా భర్తకు దూరంగా ఉంటోందట . ఇకపై కార్తీ తో కలిసి ఉండేది లేదని అతడికి విడాకులు ఇస్తానని చెప్పిందట పేరెంట్స్ కు . బిచ్చగాడు సంచలన విజయం సాధించడంతో బంగారం లాంటి అవకాశం వచ్చింది ఈ భామకు అయితే సినిమాలు అంగీకరించకుండా పెళ్లి చేసుకుని బాధపడుతోంది పాపం .

- Advertisement -

English Title: Differences between Satna Titus and her husband

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All