Homeటాప్ స్టోరీస్ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో

ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో

dhanush teamup with rx 100 directorఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం సాధించిన దర్శకుడు అజయ్ భూపతి కాగా ఆ దర్శకుడి కి తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమా చేస్తానని మాట ఇచ్చాడట . తమిళనాట ధనుష్ స్టార్ హీరో అన్న విషయం తెలిసిందే . రజనీకాంత్ పెద్దల్లుడు అయినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు . హీరోగానే కాదు నిర్మాతగా , దర్శకుడిగా కూడా సత్తా చాటాడు ధనుష్ . తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి మార్కెట్ ని ఏర్పరచుకున్నాడు ధనుష్ .

ఇక అజయ్ భూపతి విషయానికి వస్తే రాంగోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన ఈ దర్శకుడు ఆర్ ఎక్స్ 100 చిత్ర కథ పట్టుకొని పలువురు హీరోల దగ్గరకు వెళ్లి విసిగిపోయి కొత్త హీరోతో చేసాడు కట్ చేస్తే బ్లాక్ బస్టర్ అయ్యింది . కేవలం 2 కోట్లతో సినిమా చేయగా 11 కోట్ల షేర్ సాధించి ప్రభంజనం సృష్టించింది ఆర్ ఎక్స్ 100 చిత్రం . ఇక శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , రీమేక్ , డబ్బింగ్ రైట్స్ రూపంలో మరింత సొమ్ము రానుంది దాంతో ఈ దర్శకుడికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . ఇప్పటికే తెలుగులో పలువురు హీరోలు అజయ్ తో సినిమాలు చేయడానికి సిద్ధం అవుతుండగా ధనుష్ కూడా సినిమా చేద్దామని చెప్పాడట . అదీ సక్సెస్ కున్న మహిమ .

- Advertisement -

English Title: dhanush teamup with rx 100 director

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All